Breaking News

అప్పు చెల్లించమని అడిగినందుకు ఇంటికి నిప్పు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు ఒక వ్యక్తిపై దాడి చేసి, అతని ఇంటికి నిప్పు పెట్టిన ఘటన జనవరి 27, 2026న వెలుగులోకి వచ్చింది.


Published on: 28 Jan 2026 10:07  IST

అల్లూరి సీతారామరాజు జిల్లాలో అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు ఒక వ్యక్తిపై దాడి చేసి, అతని ఇంటికి నిప్పు పెట్టిన ఘటన జనవరి 27, 2026న వెలుగులోకి వచ్చింది.

పాడేరు మండలం అయినాడ పంచాయతీ పరిధిలోని చింతలపాలెం అనే మారుమూల గ్రామం.కొర్ర రామన్న (62) అనే గిరిజన వృద్ధుడు. ఈయన తన స్నేహితుడైన వంతల సోమన్నకు ₹5,600 అప్పు ఇచ్చాడు.రామన్న తన డబ్బులను తిరిగి ఇవ్వమని తరచూ సోమన్నను అడుగుతూ, గ్రామస్థులకు కూడా ఈ విషయం చెప్పడంతో సోమన్న ఆగ్రహానికి గురయ్యాడు.

ఆగ్రహంతో సోమన్న రామన్న ఇంటికి వెళ్లి మొదట కర్రతో దాడి చేశాడు. ఆపై "డబ్బులు అడుగుతావా?" అని అరుస్తూ ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ప్రమాదంలో వృద్ధుడైన రామన్న మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు.ఈ మారుమూల గ్రామంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాడేరు సీఐ దీనబంధు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి