Breaking News

'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో శ్రీశైలం డ్యాంకు స్థానం

తెలుగు రాష్ట్రాల జలప్రదాయిని అయిన శ్రీశైలం డ్యాం లండన్‌కు చెందిన ప్రతిష్టాత్మక 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' లో స్థానం సంపాదించుకుంది. ఈ ఘనత సాధించిన భారతదేశంలోనే మొట్టమొదటి నీటిపారుదల ప్రాజెక్టుగా శ్రీశైలం సరికొత్త చరిత్ర సృష్టించింది.


Published on: 12 Oct 2026 16:59  IST

తెలుగు రాష్ట్రాల జలప్రదాయిని అయిన శ్రీశైలం డ్యాం (రిజర్వాయర్) లండన్‌కు చెందిన ప్రతిష్టాత్మక 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' లో స్థానం సంపాదించుకుంది. ఈ ఘనత సాధించిన భారతదేశంలోనే మొట్టమొదటి నీటిపారుదల ప్రాజెక్టుగా శ్రీశైలం సరికొత్త చరిత్ర సృష్టించింది. అక్టోబర్ 12, 2026 (సోమవారం) నాడు శ్రీశైలంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ రికార్డుకు సంబంధించిన అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని సంస్థ ప్రతినిధులు అందజేశారు.

అద్భుతమైన నిర్మాణ శైలి  దృఢత్వం: సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. గతంలో 25 లక్షల క్యూసెక్కులకు పైగా భారీ వరద నీరు డ్యాం పైనుంచి ఓవర్‌ఫ్లో అయినప్పటికీ, ఎలాంటి నష్టం వాటిల్లకుండా అత్యంత దృఢంగా నిలిచినందుకు ఈ గుర్తింపు లభించింది.

ప్రత్యేకమైన క్రస్ట్ గేట్లు: మరే ఇతర ప్రాజెక్టుకు లేని విధంగా 60 x 55 అడుగుల పొడవు, వెడల్పుతో కూడిన భారీ క్రస్ట్ గేట్లను ఈ డ్యామ్ కలిగి ఉంది.

విశిష్ట సేవలు: 215 టీఎంసీల సామర్థ్యంతో రెండు తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, తాగునీరు, మరియు భారీ స్థాయిలో విద్యుత్తును అందించడమే కాకుండా, తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా సుదూరాన ఉన్న చెన్నై నగరానికి కూడా తాగునీరు అందిస్తున్న బహుళార్థసాధక ప్రాజెక్టుగా ఇది రికార్డు సాధించింది.

 

Follow us on , &

ఇవీ చదవండి