Breaking News

అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పాడేరు ఘాట్ రోడ్డులోని కొమలమ్మ పనుకు మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Published on: 20 Jul 2026 19:32  IST

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పాడేరు ఘాట్ రోడ్డులోని కొమలమ్మ పనుకు మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వ్యాన్ ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం గుర్రాలపాలెం గ్రామానికి చెందిన చలపతిరావు, అప్పారావు అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

వ్యాన్ లో ప్రయాణిస్తున్న మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం మాడుగుల ఆసుపత్రికి తరలించారు.బాధితులంతా అనకాపల్లి జిల్లా గుర్రాలపాలెం నుంచి రెండు వాహనాల్లో పాడేరు అమ్మవారి పాదాల వద్దకు వచ్చి పండుగ (పూజలు) చేసుకున్నారు. పండుగ ముగించుకుని ఆదివారం సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఘాట్ రోడ్డుపై ఈ విషాదం చోటుచేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement