Breaking News

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ ఒకరు మృతి

తూర్పుగోదావరి జిల్లాలో 14 మే 2026 గురువారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ (టిప్పర్) ఢీకొట్టిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.


Published on: 14 May 2026 18:32  IST

తూర్పుగోదావరి జిల్లాలో 14 మే 2026 గురువారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ (టిప్పర్) ఢీకొట్టిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.శ్రీకాకుళం జిల్లా రాజాం నుండి విజయవాడకు సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న శ్రీ వెంకటరమణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును, ఎదురుగా వేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు.

ఈ ప్రమాదంలో మరణించిన యువకుడిని శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పనసలవలస గ్రామానికి చెందిన నారు సాయి అనిల్ కుమార్ (24) గా పోలీసులు గుర్తించారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వాహనదారులు దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మొదట గోపాలపురం ప్రభుత్వాసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి