Breaking News

తూర్పుగోదావరి పెరవలిలో పాఠశాల బస్సు బోల్తా

ఈ రోజు (డిసెంబర్ 9, 2025) తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. 


Published on: 09 Dec 2025 11:17  IST

ఈ రోజు (డిసెంబర్ 9, 2025) తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. 

తూర్పుగోదావరి జిల్లా, పెరవలి మండలం, తీపర్రు ఏటిగట్టు మలుపు.ఉండ్రాజవరం మండలం తాటిపర్రులోని జ్యోతి స్కూల్‌కు చెందిన బస్సు ఇది.బస్సులో మొత్తం 25 మంది విద్యార్థులు ప్రయాణిస్తుండగా, 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి.ఏటిగట్టుపై మలుపు తిప్పుతుండగా బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానిక రైతులు, పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు మరియు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి