Breaking News

రాజధాని రైతులకు ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన

ఏపీ రాజధాని అమరావతి రైతులకు సంబంధించి మంత్రి పి. నారాయణ బుధవారం (జనవరి 7, 2026) నాడు ఒక కీలక ప్రకటన చేశారు. అమరావతి ప్రాంత రైతుల కోసం ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించింది.


Published on: 07 Jan 2026 14:49  IST

ఏపీ రాజధాని అమరావతి రైతులకు సంబంధించి మంత్రి పి. నారాయణ బుధవారం (జనవరి 7, 2026) నాడు ఒక కీలక ప్రకటన చేశారు. అమరావతి ప్రాంత రైతుల కోసం ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించింది. రాజధాని రెండో విడత భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం సందర్భంగా తుళ్లూరు మండలం వడ్డమానులో జరిగిన సభలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.

2026 జనవరి 6వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుంది. ఒక్కో రైతుకు రూ. 1.50 లక్షల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది.ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తాను స్వయంగా మాట్లాడగా, ఈ రుణమాఫీకి ఆయన అంగీకరించారని మంత్రి నారాయణ తెలిపారు.

రాజధాని నిర్మాణం కోసం రెండో విడతలో తుళ్లూరు, అమరావతి మండలాల్లోని 7 గ్రామాల నుండి సుమారు 16,666 ఎకరాలను సేకరించనున్నారు. రాజధానిని త్వరితగతిన అభివృద్ధి చేస్తామని, మూడేళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం మరియు స్పోర్ట్స్ సిటీ వంటి మౌలిక సదుపాయాలను పూర్తి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి