Breaking News

భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన భర్త

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో 2026 ఏప్రిల్ 23న (గురువారం) భార్యను భర్త అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.


Published on: 23 Apr 2026 17:29  IST

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో 2026 ఏప్రిల్ 23న (గురువారం) భార్యను భర్త అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆళ్లగడ్డ పట్టణంలోని చాంద్ వీధిలో నివాసముంటున్న పుష్ప (26)అనే మహిళ.అనుమానంతో భర్త తన భార్య గొంతును కత్తితో కోసి దారుణంగా హతమార్చాడు.

గురువారం ఉదయం ఆ ఇంట్లో పిల్లలు బిగ్గరగా ఏడుస్తుండటంతో గమనించిన ఇరుగుపొరుగు వారు లోపలికి వెళ్లి చూశారు. పుష్ప రక్తపు మడుగులో పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు.ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసిన అనంతరం పరారైన నిందితుడి (భర్త) కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి