Breaking News

అదుపు తప్పి పెళ్లి కారు బోల్తా తప్పిన ప్రమాదం

అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై గోకులపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది, అతివేగంతో అదుపు తప్పి పెళ్లి కారు బోల్తా పడింది. అయితే, ఈ ప్రమాదం నుండి నూతన వధూవరులు పీవీఎస్ చంద్రమౌళి, అఖిల సురక్షితంగా, ప్రాణాలతో బయటపడ్డారు.

Published on: 02 Jul 2026 20:06  IST

అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై గోకులపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది, అతివేగంతో అదుపు తప్పి పెళ్లి కారు బోల్తా పడింది. అయితే, ఈ ప్రమాదం నుండి నూతన వధూవరులు పీవీఎస్ చంద్రమౌళి, అఖిల సురక్షితంగా, ప్రాణాలతో బయటపడ్డారు.

వధూవరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి కారులో విశాఖపట్నం ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో గోకులపాడు వద్దకు రాగానే, కారు అతివేగం కారణంగా అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టి రోడ్డు పక్కన బోల్తా పడింది.

ప్రమాదం జరిగిన సమయంలో జాతీయ రహదారిపై ఇతర వాహనాలు ఏవీ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తీవ్రతకు కారు ముందు చక్రాలు పూర్తిగా ఊడిపోయాయి. అయినప్పటికీ, కారులో ఉన్న నూతన దంపతులతో పాటు మరో ఇద్దరు బంధువులు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం అనంతరం వధూవరులు మరో ప్రైవేట్ వాహనంలో సురక్షితంగా విశాఖపట్నం చేరుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement