Breaking News

అన్నవరం ప్రసాద కౌంటర్ వద్ద భక్తుల ఘర్షణ

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వద్ద ఫిబ్రవరి 9, 2026న జరిగిన ఘటన.


Published on: 09 Feb 2026 12:57  IST

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వద్ద ఫిబ్రవరి 9, 2026న జరిగిన ఘటన.రత్నగిరి కొండ దిగువన ఉన్న తొలి పావంచా ప్రసాద విక్రయ కౌంటర్ వద్ద ఆదివారం (ఫిబ్రవరి 8) మధ్యాహ్నం కొందరు యువకులు వీరంగం సృష్టించారు.ప్రసాదం కొనుగోలు చేసే క్రమంలో క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ మొదలైంది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు దాదాపు 15 నిమిషాల పాటు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని భయాందోళనలు సృష్టించారు.

ఈ వీరంగం జరుగుతున్న సమయంలో అక్కడ దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది గానీ, పోలీసులు గానీ అందుబాటులో లేకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, గత కొన్ని రోజులుగా అన్నవరం ప్రసాదం కౌంటర్లలో ఎలుకలు తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంపై దేవస్థానం ఈవో చర్యలు తీసుకుని, ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి