Breaking News

ఇండిగో విమానం అత్యవసర లాండింగ్

మార్చి 5, 2026 గురువారం నాడు గన్నవరం (విజయవాడ) విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ఆగిపోయింది.


Published on: 05 Mar 2026 15:57  IST

మార్చి 5, 2026 గురువారం నాడు గన్నవరం (విజయవాడ) విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ఆగిపోయింది.కృష్ణా జిల్లా గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.విమానం రన్‌వేపై నుంచి టేకాఫ్ అవుతుండగా, ఇంజిన్‌లో సమస్య ఉన్నట్లు పైలట్ గుర్తించారు.

పైలట్ అప్రమత్తమై విమానాన్ని వెంటనే రన్‌వేపైనే నిలిపివేసి, పెద్ద ప్రమాదాన్ని తప్పించారు.ఈ విమానంలో మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఏపీ మంత్రి గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఉన్నట్లు సమాచారం.ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని కథనం ద్వారా తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి