Breaking News

వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా కొత్తూరులోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) టైప్-4 వసతిగృహంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.


Published on: 31 Jul 2026 14:58  IST

శ్రీకాకుళం జిల్లా కొత్తూరులోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) టైప్-4 వసతిగృహంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినిని సవర పూజగా గుర్తించారు. ఈమె ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ (BiPC) చదువుతోంది.ఈమె సీతంపేట మండలం దేవానపురం పంచాయితీ పరిధిలోని లక్కయ్యగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక.మొదట రాజాంలోని ఒక కళాశాలలో చేరిన పూజ, ఆ తర్వాత తల్లిదండ్రుల నిర్ణయం మేరకు గత 20 రోజుల క్రితమే ఈ కొత్తూరు కేజీబీవీ వసతి గృహంలో చేరింది.

దర్యాప్తు

గురువారం అర్ధరాత్రి వసతి గృహంలోని పై అంతస్తు గదిలో ఈమె ఫ్యాన్‌కు ఉరివేసుకోగా, శుక్రవారం ఉదయం సిబ్బంది గమనించారు.సమాచారం అందుకున్న కొత్తూరు ఎస్సై కె. వెంకటేశ్‌ నేతృత్వంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.విద్యార్థిని ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి