Breaking News

వినుకొండలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

పల్నాడు జిల్లా వినుకొండలో 26 జూన్ 2026న రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు విజయవంతంగా అరెస్ట్ చేశారు.


Published on: 26 Jun 2026 16:31  IST

పల్నాడు జిల్లా వినుకొండలో 26 జూన్ 2026 రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు విజయవంతంగా అరెస్ట్ చేశారు.

నిందితుడి పేరు షేక్ రఫీ అలియాస్ పొట్టి రఫీ. ఇతనిపై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 చోరీ కేసులు ఉన్నాయి. వినుకొండ, మదనపల్లి, అద్దంకి లాంటి పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు.ఇటీవల వినుకొండలోని 'వేక్షిత జ్యువెలర్స్' దుకాణంలో జరిగిన భారీ దొంగతనం కేసు ఆధారంగా పోలీసులు నిఘా పెట్టి ఇతడిని అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు

పోలీసులు నిందితుడి నుంచి కింది వస్తువులను రికవరీ చేశారు:

రూ. 27 లక్షల విలువైన బంగారం మరియు వెండి ఆభరణాలు.దొంగతనాలకు ఉపయోగించిన ఒక ఆటో మరియు ద్విచక్ర వాహనం (బైక్).వినుకొండ పోలీసులు ఈ మోస్ట్ వాంటెడ్ దొంగను చాకక్యంగా పట్టుకుని కేసును ఛేదించారు.

 

Follow us on , &

ఇవీ చదవండి