Breaking News

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కళాశాల బస్సు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాన్ని కళాశాల బస్సు ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది.సోమవారం ఉదయం విద్యార్థులతో కళాశాలకు వెళ్తున్న ఒక కాలేజీ బస్సు, సంతనూతలపాడు మండలం ఎమ్‌. వేములపాడు సమీపంలోకి రాగానే అదుపుతప్పింది.


Published on: 20 Jul 2026 18:30  IST

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాన్ని కళాశాల బస్సు ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది.సోమవారం ఉదయం విద్యార్థులతో కళాశాలకు వెళ్తున్న ఒక కాలేజీ బస్సు, సంతనూతలపాడు మండలం ఎమ్‌. వేములపాడు సమీపంలోకి రాగానే అదుపుతప్పింది.అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న ఒక విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఉన్నారు. స్తంభాన్ని ఢీకొనడంతో కొందరు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి.అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు

 

Follow us on , &

ఇవీ చదవండి