Breaking News

అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి (GGH)లో పీజీ అనస్థీషియా ఫైనలియర్ చదువుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ దీపిక 2026 ఫిబ్రవరి 5వ తేదీ తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 


Published on: 05 Feb 2026 14:14  IST

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి (GGH)లో పీజీ అనస్థీషియా ఫైనలియర్ చదువుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ దీపిక 2026 ఫిబ్రవరి 5వ తేదీ తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 

ఆసుపత్రి ప్రాంగణంలోనే ఆమె విగతజీవిగా పడి ఉండటాన్ని సహచర వైద్యులు గుర్తించారు.ఆమె చేతిపై ఇంజెక్షన్ తీసుకున్న గుర్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరణానికి ముందు ఆమె తీవ్ర కడుపు నొప్పితో బాధపడినట్లు, ఆ సమయంలోనే స్వయంగా ఇంజెక్షన్ తీసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించి, పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.

విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం నుండి ఆమె తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరణానికి గల కారణాలను నిర్ధారించనున్నారు. ఈ ఘటన విజయవాడ జీజీహెచ్ వైద్యులు మరియు పీజీ విద్యార్థుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. 

Follow us on , &

ఇవీ చదవండి