Breaking News

జనసేన, టీడీపీ కొత్త లోగో ఇదే??

జనసేన టీడీపీ పొత్తుకు సూచికగా ఉమ్మడి లోగోను అక్కడ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ గుర్తు అయిన సైకిల్, జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్‌ లతోపాటు రెండు పార్టీలను కలుపుతున్నట్టు పసుపు, ఎరుపు రిబ్బన్ల మాదిరిగా ఒక లోగోను ఏర్పాటు చేశారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి లోగో కనిపించకపోవడం.. ఇప్పుడు ఈ ఉమ్మడి లోగో కనిపించడం ఆసక్తి రేపింది.


Published on: 24 Feb 2024 16:39  IST

జనసేన, తెలుగుదేశం పార్టీలు తమ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపింది. దీంతో రెండు పార్టీలు 118 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. మరో 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీతో పొత్తు ఖరారయ్యాక 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి