Breaking News

సీఎం జగన్‌కు నారా లోకేష్ రిక్వెస్ట్

నారా లోకేష్ సీఎం జగన్‌కు లేఖ రాశారు.. ప్రధానంగా హోంగార్డులకు సంబంధించిన సమస్యల్ని ప్రస్తావించారు. వారి జీతాలను పెంచాలని.. అలాగే పదవీ విరమణ వయస్సును పెంచాలని కోరారు. సీఎల్స్, గ్రాట్యుటీని కూడా చెల్లించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో హోంగార్డుల వేతనాన్ని రూ.600 చేశామని.. అలాగే జీవిత బీమాను కూడా పెంచామన్నారు. వేతనాల పెంపు విషయంలో కేంద్రం, సుప్రీం కోర్టు సూచనల్ని పాటించాలని లోకేష్ కోరారు.


Published on: 24 Aug 2023 13:55  IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని లేఖలో కోరారు. హోంగార్డులకు జీతాలు పెంచి, సౌకర్యాలు కల్పించాలని.. చాలీచాలని జీతాలతో హోంగార్డుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. కరోనా వేళ హోంగార్డులు అందించిన సేవలు మరచిపోలేమన్న లోకేష్.. హోంగార్డులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. 11వ వేతన సవరణ సంఘం సూచన మేరకు హోంగార్డుల జీతభత్యాలు తక్షణం పెంచాలని.. పదవీ విరమణ వయసును 62 ఏళ్లుగా నిర్ణయించాలని కోరారు.

రూ.పది లక్షలు రిటైర్మెంట్‌ గ్రాట్యుటీ చెల్లించాలని లేఖలో కోరారు. క్యాజువల్‌ లీవ్స్‌, తెలంగాణ కంటే ఎక్కువగా వేతనాల పెంపు, హోంగార్డులను ప్రభుత్వ వ్యవస్థగా చూస్తామని ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీల్ని జగన్‌ నెరవేర్చాలన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రింబవళ్లూ విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులు చాలీచాలని వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో వారి రోజువారీ వేతనాన్ని రూ.600 చేయడమేగా కాక.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఇచ్చే జీవిత బీమాను రూ.30 లక్షలకు పెంచామన్నారు. కానీ ఈ ప్రభుత్వం రోజువారీ వేతనాన్ని రూ.110 పెంచి ఊరుకుందని.. వేతనాల పెంపు విషయంలో సుప్రీంకోర్టు, కేంద్రం, పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ, హోం అఫైర్స్‌ సూచనల్ని అమలు చేయలేదన్నారు లోకేష్.

Follow us on , &

Source From: BS News

ఇవీ చదవండి