Breaking News

పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేసిన MLA

విజయనగరం జిల్లాలో 2 జూలై 2026 (గురువారం) నాడు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు. విజయనగరం రూరల్ మండలం మలిచర్ల గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె రైతులకు నూతన పాస్ పుస్తకాలను అందజేశారు.

Published on: 02 Jul 2026 15:52  IST

విజయనగరం జిల్లాలో 2 జూలై 2026 (గురువారం) నాడు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు. విజయనగరం రూరల్ మండలం మలిచర్ల గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె రైతులకు నూతన పాస్ పుస్తకాలను అందజేశారు.

గత వైకాపా ప్రభుత్వ హయాంలో జారీ చేసిన పాస్ పుస్తకాల స్థానంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారిక రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తోంది.గత ప్రభుత్వ పాలనలో రైతులు భూ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వాటన్నింటినీ పరిష్కరించి సకాలంలో పాస్ పుస్తకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి