Breaking News

విశాఖలో నవవధువు అనుమానాస్పదస్థితిలో మృతి

విశాఖపట్నం పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో యాండ్రాపు కృష్ణవేణి (25) అనే నవవధువు తన అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెళ్లయిన కేవలం 40 రోజులకే ఈ విషాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది.


Published on: 25 Jun 2026 18:12  IST

విశాఖపట్నం పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో యాండ్రాపు కృష్ణవేణి (25) అనే నవవధువు తన అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెళ్లయిన కేవలం 40 రోజులకే ఈ విషాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది.

విజయనగరం జిల్లా మెంటాడ గ్రామానికి చెందిన యాండ్రాపు కృష్ణవేణికి, తన బంధువైన యాండ్రాపు మురళీతో ఏడాది మే 13 వివాహం జరిగింది.పెళ్లయిన తర్వాత ఈ కొత్త దంపతులు గత 20 రోజులుగా పీఎం పాలెంలోని ఆర్ హెచ్ కాలనీ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.భర్త మురళీ నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా, కృష్ణవేణి గోపాలపట్నంలోని ఒక షాపులో ఉద్యోగం చేస్తోంది.

బుధవారం ఉదయం భర్త మురళీ ఎప్పటిలాగే తన విధులకు వెళ్లాడు.రాత్రి అతను పని ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి, కృష్ణవేణి గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించింది.దీన్ని చూసిన భర్త వెంటనే కృష్ణవేణి కుటుంబ సభ్యులకు మరియు స్థానిక పీఎం పాలెం పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న వెంటనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) అప్పలరాజు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారుక్లూస్ టీమ్ సాయంతో పోలీసులు ఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ (KGH) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతానికి పీఎం పాలెం పోలీసులు దీనిని అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై భర్త మురళీతో పాటు ఇరు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి