Breaking News

యువతకు వెంకయ్యనాయుడు కీలక సందేశం

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు శనివారం (21 ఫిబ్రవరి 2026) విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు మరియు యువతకు కీలక సందేశాన్ని ఇచ్చారు. 

Published on: 21 Feb 2026 15:45  IST

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు శనివారం (21 ఫిబ్రవరి 2026) విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు మరియు యువతకు కీలక సందేశాన్ని ఇచ్చారు. 

కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు పొందడం వల్ల ప్రయోజనం లేదని, సంపాదించిన చదువుకు తగ్గ పరిజ్ఞానం (Knowledge) ఉండటమే అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.ప్రతి చిన్న విషయానికి గూగుల్‌పై ఆధారపడటం మానేసి, మన సొంత మెదడుకు (Brain) పని చెప్పాలని ఆయన సూచించారు.

ఏఐ సాంకేతికత వల్ల మానవ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, దానిని అదుపులో ఉంచుకుంటూనే ముందుకు సాగాలని హెచ్చరించారు.మనం ఎక్కడికి వెళ్లినా మాతృభూమిని, మాతృభాషను (తెలుగు), చదువు చెప్పిన గురువులను మర్చిపోకూడదని పిలుపునిచ్చారు.

రాజకీయాల్లో పెరుగుతున్న విమర్శలు, బూతుల సంస్కృతిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. విలువలకే ప్రజలు పట్టం కడతారని గుర్తుచేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి