Breaking News

ఏపీ లిక్కర్ స్కామ్‌‌ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించి ముగ్గురు జగన్ బ్యాచ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగలింది.

ఏపీ లిక్కర్ స్కామ్‌‌ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించి ముగ్గురు జగన్ బ్యాచ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగలింది.


Published on: 02 May 2025 14:41  IST

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న మద్యం వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సన్నిహితులైన ముగ్గురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె. ధనంజయ రెడ్డి, వ్యక్తిగత సహాయకులు పి. కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు పిటిషన్ దాఖలు చేశారు.అయితే, ప్రాసిక్యూషన్ తమ అభిప్రాయం తెలిపేందుకు కొంత సమయం కావాలనడంతో, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 7కి వాయిదా వేసింది.

పిటిషనర్ల వాదన ప్రకారం, ఇప్పటికే అరెస్ట్ అయిన కొందరు నిందితులు తమ పేర్లు పేర్కొన్నారని, అరెస్ట్‌కు ముందు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. కానీ ప్రభుత్వ న్యాయవాది– దీనిపై ప్రభుత్వం దృష్టిని తీసుకోవాల్సి ఉందని, వెంటనే నిర్ణయం ఇవ్వడం సాధ్యంకాదని తెలిపారు. హైకోర్టు ధర్మాసనం కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించింది.ఇప్పటికే ఈ కేసులో జగన్‌కి సన్నిహితుడైన రాజ్ కేసిరెడ్డి, అతని పీఏలను అరెస్ట్ చేశారు. దీంతో తదుపరి చర్యలపై అనుమానాలు పెరుగడంతో జగన్ బృందం హైకోర్టును ఆశ్రయించిందని తెలుస్తోంది.

కేసు విచారణ కొనసాగుతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఇప్పటికే పలువురి నుంచి కీలక సమాచారం సేకరించింది. ఇంకా కొందరిని విచారించాల్సి ఉండగా, మరికొందరికి నోటీసులు ఇవ్వాల్సిన అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ, కోర్టు నుంచి ఆశించిన రిలీఫ్ మూడుగురు వ్యక్తులకు ఈ దశలో దక్కలేదు.

Follow us on , &

ఇవీ చదవండి