Breaking News

కేంద్ర ప్రభుత్వం విదేశీ ముడిచమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి 'సముద్ర మంథన్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ పథకం'  ను ప్రారంభించింది.

కేంద్ర ప్రభుత్వం విదేశీ ముడిచమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి 'సముద్ర మంథన్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ పథకం'  ను ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం కేంద్ర మంత్రివర్గం రూ. 84,084 కోట్ల భారీ బడ్జెట్‌ను ఆమోదించింది.


Published on: 03 Aug 2026 13:52  IST

కేంద్ర ప్రభుత్వం విదేశీ ముడిచమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి 'సముద్ర మంథన్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ పథకం'  ను ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం కేంద్ర మంత్రివర్గం రూ. 84,084 కోట్ల భారీ బడ్జెట్‌ను ఆమోదించింది.
సముద్ర గర్భంలో లోతైన, అత్యంత లోతైన ప్రాంతాలలో చమురు ఆచూకీ కోసం తవ్వే ఒక్కో బావికి అయ్యే ఖర్చులో 50 శాతం లేదా గరిష్టంగా రూ. 650 కోట్ల వరకు నిధులను కేంద్ర ప్రభుత్వం నేరుగా బడ్జెట్ ద్వారా భరిస్తుంది. రాబోయే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా సముద్ర తీరాలలో ఇలాంటి 60 లోతైన అన్వేషణ బావులను తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.మొత్తం బడ్జెట్‌లో సగానికి పైగా రాబోయే ఐదేళ్లలో కేవలం ఈ చమురు బావుల తవ్వకాల కోసమే కేటాయించారు.
చమురు నిల్వలు బయటపడిన తర్వాత వాటిని సులభంగా మార్కెట్‌కు తరలించేందుకు, వాటర్ పైప్‌లైన్లు మరియు ప్రాసెసింగ్ ప్లాంట్ల వంటి ఉమ్మడి వసతుల కోసం రూ. 10,000 కోట్లు కేటాయించారు. దీనివల్ల ప్రైవేట్ కంపెనీలు విడివిడిగా కాకుండా ఈ కామన్ పైప్‌లైన్ వసతిని కలిపి వాడుకోవచ్చు.
సముద్ర గర్భంలో చమురు నిల్వలను గుర్తించేందుకు ఆధునిక సీస్మిక్ మరియు జియోలాజికల్ డేటా సేకరణ కోసం మరో రూ. 28,534 కోట్లు వెచ్చించనున్నారు.

సముద్రంలో చమురు కోసం తవ్వకాలు జరపడం అనేది అత్యంత ఖరీదైనది మరియు రిస్క్‌తో కూడుకున్న పని. ఒకవేళ అక్కడ చమురు పడకపోతే కంపెనీలు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వమే ఈ రిస్క్‌ను పంచుకుంటూ రూ. 650 కోట్ల వరకు సబ్సిడీ ఇవ్వడం వల్ల, అంతర్జాతీయ మరియు దేశీయ ప్రైవేట్ కంపెనీలు భారతదేశంలో చమురు అన్వేషణకు ముందుకు వస్తాయి. దీనివల్ల భారతదేశ చమురు దిగుమతులు తగ్గి, ఇంధన భద్రత పెరుగుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement