Breaking News

భారతదేశంలో ₹10 మరియు ₹20 ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది.

భారతదేశంలో ₹10 మరియు ₹20 ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.


Published on: 28 Jul 2026 18:12  IST

భారతదేశంలో ₹10 మరియు ₹20 ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ట్రయల్ రన్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మొదటగా ₹10 నోట్లు 100 కోట్లు, ₹20 నోట్లు 100 కోట్లు (మొత్తం 200 కోట్ల ప్లాస్టిక్ నోట్లను) మార్కెట్లోకి విడుదల చేసి పరీక్షించనుంది.

పాత నోట్లు రద్దు కావు: ప్రస్తుతమున్న కాగితపు ₹10, ₹20 నోట్లు పూర్తిగా చెల్లుబాటు అవుతాయి. వాటిని రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. మార్కెట్లో ప్లాస్టిక్ నోట్లు, కాగితపు నోట్లు రెండూ కలిసి చలామణిలో ఉంటాయి.ప్రస్తుతానికి గ్లోబల్ టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. వచ్చే ఏడాది (2027) నాటికి ఈ ప్లాస్టిక్ నోట్లు సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్లాస్టిక్ నోట్ల వల్ల ఉపయోగాలు

ఎక్కువ కాలం మన్నిక: ఇవి కాగితపు నోట్ల కంటే 2 నుండి 6 రెట్లు ఎక్కువ కాలం చిరిగిపోకుండా మన్నుతాయి.

నీటిలో నానవు: ఇవి ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారవుతాయి కాబట్టి నీటిలో తడిచినా, మురికి అయినా పాడవవు.

నకిలీ నోట్లకు అడ్డుకట్ట: ఈ నోట్లలో అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లు ఉండటం వల్ల నకిలీ నోట్లను సృష్టించడం చాలా కష్టం.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement