Breaking News

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సిమ్ బైండింగ్' నిబంధనల అమలు గడువును డిసెంబర్ 31, 2026 వరకు పొడిగించే అవకాశం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సిమ్ బైండింగ్' (SIM Binding) నిబంధనల అమలు గడువును డిసెంబర్ 31, 2026 వరకు పొడిగించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం అందుతోంది.


Published on: 02 Apr 2026 12:19  IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సిమ్ బైండింగ్' (SIM Binding) నిబంధనల అమలు గడువును డిసెంబర్ 31, 2026 వరకు పొడిగించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం అందుతోంది. మొదట ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుండి కఠినంగా అమలు కావాల్సి ఉంది, కానీ సాంకేతిక కారణాల వల్ల కంపెనీలకు మరికొంత సమయం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. 

ప్రస్తుతం మీరు గతంలో లాగే వైఫై (Wi-Fi) లేదా ఇతర పరికరాల ద్వారా వాట్సాప్ వాడుకోవచ్చు. అయితే, ఈ వెసులుబాటు పొడిగించిన గడువు (డిసెంబర్ 2026) వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది.ఈ రూల్ పూర్తిగా అమలులోకి వస్తే, మీ వాట్సాప్ ఏ నంబర్‌తో రిజిస్టర్ అయి ఉందో, ఆ భౌతిక సిమ్ కార్డ్ (Physical SIM) తప్పనిసరిగా అదే ఫోన్‌లో ఉండాలి. ఫోన్ నుండి సిమ్ తీసేస్తే వాట్సాప్ పనిచేయదు.

వాట్సాప్ వెబ్ వాడుతున్న వారు ప్రతి 6 గంటలకు ఒకసారి లాగ్ అవుట్ అవ్వాలని, మళ్ళీ మొబైల్ ద్వారా స్కాన్ చేయాలని మొదట నిబంధన పెట్టారు. ప్రస్తుతానికి ఈ నిబంధన అమలును కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది.మరోవైపు, వాట్సాప్ ఫోన్ నంబర్‌తో పనిలేకుండా కేవలం యూజర్ నేమ్స్ ద్వారా చాట్ చేసే ఫీచర్‌ను జూన్ 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి