Breaking News

ప్రముఖ ఇండియన్ ఫిన్‌టెక్ స్టార్టప్ ‘క్రెడ్’ వ్యవస్థాపకుడు కునాల్ షా, వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా నియమితులయ్యారు.

ప్రముఖ ఇండియన్ ఫిన్‌టెక్ స్టార్టప్ ‘క్రెడ్’ వ్యవస్థాపకుడు కునాల్ షా, వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా నియమితులయ్యారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ అయిన మెటా ప్లాట్‌ఫార్మ్స్ ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.


Published on: 23 Jun 2026 12:31  IST

ప్రముఖ ఇండియన్ ఫిన్‌టెక్ స్టార్టప్ క్రెడ్వ్యవస్థాపకుడు కునాల్ షా, వాట్సాప్ గ్లోబల్ హెడ్గా నియమితులయ్యారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ అయిన మెటా ప్లాట్ఫార్మ్స్ ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.

మెటా భారీ పెట్టుబడిడీల్

క్రెడ్ స్టార్టప్‌లో మెటా సంస్థ 900 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోంది.ఈ పెట్టుబడి ద్వారా క్రెడ్‌లో మెటాకు సుమారు 20 శాతం మైనారిటీ వాటా లభిస్తుంది.మెటా కేవలం ఆర్థిక పెట్టుబడిదారుడిగా మాత్రమే ఉంటుంది, క్రెడ్ వినియోగదారుల డేటాకు మెటాకు ఎటువంటి యాక్సెస్ ఉండదు.

కునాల్ షా కొత్త బాధ్యతలు

కునాల్ షా క్రెడ్ సీఈఓ పదవి నుంచి తప్పుకుని, ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వినియోగదారులున్న వాట్సాప్ అంతర్జాతీయ కార్యకలాపాలను సిలికాన్ వ్యాలీ నుండి నడిపించనున్నారు.క్రెడ్ సీఈఓగా ప్రస్తుత సీనియర్ ఎగ్జిక్యూటివ్ మితెన్ సంపత్ తాత్కాలికంగా బాధ్యతలు చేపడతారు. కునాల్ షా కేవలం షేర్ హోల్డర్‌గా మాత్రమే కొనసాగుతారు.గత 7 ఏళ్లుగా వాట్సాప్ హెడ్‌గా ఉన్న విల్ క్యాథ్‌కార్ట్ స్థానంలో కునాల్ బాధ్యతలు తీసుకుంటారు. క్యాథ్‌కార్ట్ మెటాలోనే సరికొత్త ప్రొడక్ట్స్ తయారీ విభాగంలో పనిచేస్తారు.

సిలికాన్ వ్యాలీకి చెందిన ఒక అంతర్జాతీయ టెక్ దిగ్గజ సంస్థకు, భారతదేశంలోనే పుట్టి పెరిగిన ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు గ్లోబల్ హెడ్‌గా వెళ్లడం ఇదే మొదటిసారి.భారతదేశంలో వాట్సాప్ పేమెంట్స్, బిజినెస్ మెసేజింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలను మరింత విస్తరించడానికి కునాల్ షా అనుభవం ఉపయోగపడుతుందని మెటా భావిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement