Breaking News

మెటా సంస్థ అధికారికంగా 'వాట్సాప్ ప్లస్' పేరుతో ఒక పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది.

మెటా సంస్థ అధికారికంగా 'వాట్సాప్ ప్లస్' పేరుతో ఒక పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. దీని ధర నెలకు ₹79 రూపాయలు గా నిర్ణయించారు, అలాగే మొదటి 1 నెల పాటు ఉచితంగా వాడటానికి ట్రయల్ కూడా ఇస్తున్నారు.


Published on: 26 Jun 2026 10:33  IST

మెటా (Meta) సంస్థ అధికారికంగా 'వాట్సాప్ ప్లస్' పేరుతో ఒక పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. దీని ధర నెలకు ₹79 రూపాయలు గా నిర్ణయించారు, అలాగే మొదటి 1 నెల పాటు ఉచితంగా వాడటానికి ట్రయల్ కూడా ఇస్తున్నారు.

సాధారణ వాట్సాప్ చాటింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ ఎప్పటిలాగే పూర్తిగా ఉచితం. కేవలం అదనపు ఫీచర్లు, కస్టమైజేషన్ కావాలనుకునే వారు మాత్రమే ఈ సేవలను కొనుగోలు చేయవచ్చు.

వాట్సాప్ ప్లస్లో లభించే ముఖ్యమైన ఫీచర్లు

కస్టమ్ యాప్ ఐకాన్స్: ఫోన్ హోమ్ స్క్రీన్‌పై ఉండే వాట్సాప్ గ్రీన్ కలర్ లోగోను మీకు నచ్చిన 14 రకాల డిజైన్లు లేదా రంగుల్లోకి మార్చుకోవచ్చు.

ప్రీమియం థీమ్స్: చాట్ లోపల ఉండే టెక్స్ట్ బబుల్స్, వాల్‌పేపర్స్, బ్యాక్‌గ్రౌండ్స్‌ను రాయల్ పర్పుల్, వెల్వెట్ రెడ్ వంటి 18 రకాల ప్రీమియం రంగుల్లోకి మార్చుకోవచ్చు.

ఎక్కువ చాట్స్ పిన్ చేయడం: సాధారణ వాట్సాప్‌లో కేవలం 3 చాట్స్ మాత్రమే పిన్ చేయగలరు, కానీ వాట్సాప్ ప్లస్‌లో 20 చాట్స్ వరకు టాప్‌లో పిన్ చేసి పెట్టుకోవచ్చు.

ప్రత్యేక రింగ్‌టోన్లు: మీ ముఖ్యమైన కాంటాక్ట్స్ కోసం ప్రత్యేకమైన 10 రకాల ప్రీమియం రింగ్‌టోన్లు మరియు నోటిఫికేషన్ టోన్స్ సెట్ చేసుకోవచ్చు.

యానిమేటెడ్ స్టిక్కర్స్: చాటింగ్‌లో పంపించుకోవడానికి ఫుల్-స్క్రీన్ స్పెషల్ ఎఫెక్ట్స్‌తో కూడిన ప్రత్యేకమైన స్టిక్కర్ ప్యాక్స్ లభిస్తాయి.

చాట్ లిస్ట్ మేనేజ్‌మెంట్: మీ చాట్ హిస్టరీని సులభంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి అప్‌గ్రేడెడ్ చాట్ లిస్ట్ ఆప్షన్లు ఉంటాయి.

సబ్‌స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి

మీ మొబైల్‌లో Official WhatsApp App ఓపెన్ చేయండి.పైన కుడి వైపున ఉండే Settings లోకి వెళ్ళండి.అక్కడ మీకు Subscriptions అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.WhatsApp Plus ని ఎంచుకుని, గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ద్వారా ₹79 చెల్లించి సబ్‌స్క్రిప్షన్ యాక్టివేట్ చేసుకోవచ్చు.ఈ సేవలు వద్దు అనుకుంటే ఎప్పుడైనా సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు (Cancel) చేసుకోవచ్చు

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement