Breaking News

దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు UFBU బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చింది.

సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు బ్యాంకు సమ్మె జరగనుంది. UFBU ఈ సమ్మెకు పిలుపునిచ్చింది.


Published on: 24 Sep 2026 10:31  IST

సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు బ్యాంకు సమ్మె జరగనుంది. UFBU ఈ సమ్మెకు పిలుపునిచ్చింది.

సమ్మె తేదీలు ,సెలవులు

సెప్టెంబర్ 26 (నాల్గవ శనివారం): బ్యాంకులకు సాధారణ వారాంతపు సెలవు దినం.

సెప్టెంబర్ 27 (ఆదివారం): కస్టమర్ల సౌకర్యార్థం మరియు రాబోయే సమ్మె, హాఫ్ ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ (సెప్టెంబర్ 30) దృష్ట్యా ఆదివారం (సెప్టెంబర్ 27) నాడు బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 28, 29, 30 (సోమ, మంగళ, బుధవారాలు): UFBU ఆధ్వర్యంలో 3 రోజుల పాటు దేశవ్యాప్త బ్యాంకు సమ్మె కొనసాగుతుంది.

ప్రధాన డిమాండ్లు ఏమిటి

వారానికి 5 రోజుల పనిదినాలను తక్షణమే అమలు చేయాలి.

పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించడం మరియు పెన్షన్ల అప్‌డేట్ చేయడం.

పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకంపై స్పష్టత.

కస్టమర్లకు సూచనలు

సమ్మె కారణంగా బ్రాంచ్ కార్యకలాపాలు, చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలకు అంతరాయం కలగవచ్చు. కాబట్టి మీ ముఖ్యమైన బ్యాంకు పనులను ముందే పూర్తి చేసుకోవడం మంచిది.సమ్మె రోజుల్లో కూడా UPI, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ మరియు ఏటీఎం (ATM) సేవలు యథావిధిగా డిజిటల్ పద్ధతిలో అందుబాటులో ఉంటాయి.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement