Breaking News

టీనేజర్ల ఆన్‌లైన్ భద్రతను మరింత మెరుగుపరచడం కోసం మెటా యాజమాన్యంలోని వాట్సాప్ సరికొత్త పేరెంటల్ కంట్రోల్స్ ఫీచర్లను ప్రకటించింది.

టీనేజర్ల (Teens) ఆన్‌లైన్ భద్రతను మరింత మెరుగుపరచడం కోసం మెటా (Meta) యాజమాన్యంలోని వాట్సాప్ సరికొత్త పేరెంటల్ కంట్రోల్స్ (Parental Controls) ఫీచర్లను ప్రకటించింది. గతంలో కేవలం 13 ఏళ్లలోపు పిల్లల కోసం మాత్రమే ఉన్న కంట్రోల్స్ పరిధిని పెంచుతూ, తాజాగా టీనేజ్ పిల్లల అకౌంట్లను కూడా తల్లిదండ్రులు పర్యవేక్షించేలా ఈ ఆప్షనల్ ఫీచర్లను అప్‌డేట్ చేసింది.

Published on: 01 Oct 2026 12:34  IST

టీనేజర్ల (Teens) ఆన్‌లైన్ భద్రతను మరింత మెరుగుపరచడం కోసం మెటా (Meta) యాజమాన్యంలోని వాట్సాప్ సరికొత్త పేరెంటల్ కంట్రోల్స్ (Parental Controls) ఫీచర్లను ప్రకటించింది. గతంలో కేవలం 13 ఏళ్లలోపు పిల్లల కోసం మాత్రమే ఉన్న కంట్రోల్స్ పరిధిని పెంచుతూ, తాజాగా టీనేజ్ పిల్లల అకౌంట్లను కూడా తల్లిదండ్రులు పర్యవేక్షించేలా ఈ ఆప్షనల్ ఫీచర్లను అప్‌డేట్ చేసింది.

ప్రైవసీ సెట్టింగ్స్ నియంత్రణ : పిల్లల ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూడాలి, వారిని గ్రూపుల్లో ఎవరు యాడ్ చేయాలనే విషయాలను తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు. ఒకవేళ పిల్లలు ఈ సెట్టింగ్స్‌ను మార్చాలి అనుకుంటే, తల్లిదండ్రులు సెట్ చేసిన 6-డిజిట్ PIN అవసరమవుతుంది.

గ్రూప్ యాక్టివిటీ అలర్ట్స్ : పిల్లలు ఏదైనా కొత్త వాట్సాప్ గ్రూప్‌లో చేరినా లేదా గ్రూప్ నుండి బయటకు వచ్చినా తల్లిదండ్రులకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా, వారు ఉన్న గ్రూప్‌లో మెంబర్స్ సంఖ్య అకస్మాత్తుగా పెరిగితే కూడా పేరెంట్స్‌కు అలర్ట్ అందుతుంది.

మెటా AI పరిమితులు (Meta AI Restrictions): వాట్సాప్ లోని Meta AI ఫీచర్‌ను పిల్లలు ఎలా ఉపయోగించాలో తల్లిదండ్రులు కంట్రోల్ చేయవచ్చు. ఇందులో సాధారణ 13+ డిఫాల్ట్ సెట్టింగ్‌తో పాటు, మరింత సురక్షితమైన "Limited Content" ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీనివల్ల కొన్ని సున్నితమైన అంశాలపై AI తో చాట్ చేయడం బ్లాక్ అవుతుంది.

చానెల్స్ , స్టేటస్ కంట్రోల్ : పిల్లలు ఏయే చానెల్స్ ఫాలో అవ్వాలి, ఎవరి స్టేటస్ (Status) అప్‌డేట్లు చూడాలి, అలాగే వారి స్టేటస్‌లను ఎవరు చూడాలనేది తల్లిదండ్రులు నియంత్రించవచ్చు.

ఈ పేరెంటల్ కంట్రోల్స్ ఆన్ చేసినప్పటికీ, పిల్లల పర్సనల్ చాట్స్ లేదా కాల్స్ వివరాలను తల్లిదండ్రులు చూడలేరు. వాట్సాప్ లోని ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఎప్పటిలాగే కొనసాగుతుంది కాబట్టి ఆ మెసేజ్‌లను వాట్సాప్ లేదా ఇతరులు ఎవరూ చదవలేరు.

Follow us on , &

ఇవీ చదవండి