Breaking News

టెక్ దిగ్గజం యాపిల్ తన సరికొత్త స్మార్ట్ హోమ్ పరికరం "యాపిల్ హోమ్ వ్యూ" ను అక్టోబర్ 13న అధికారికంగా విడుదల చేసింది.

టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తన సరికొత్త స్మార్ట్ హోమ్ పరికరం "యాపిల్ హోమ్ వ్యూ" ను అక్టోబర్ 13, 2026న జరిగిన ప్రత్యేక ‘వెల్‌కమ్ హోమ్’ ఈవెంట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త పరికరం ఐప్యాడ్ లాంటి స్క్రీన్‌తో టేబుల్‌పై పెట్టుకోవడానికి లేదా గోడకు తగిలించుకోవడానికి వీలుగా రూపొందించబడింది.

Published on: 14 Oct 2026 14:54  IST

టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తన సరికొత్త స్మార్ట్ హోమ్ పరికరం "యాపిల్ హోమ్ వ్యూ" ను అక్టోబర్ 13, 2026న జరిగిన ప్రత్యేక ‘వెల్‌కమ్ హోమ్’ ఈవెంట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త పరికరం ఐప్యాడ్ లాంటి స్క్రీన్‌తో టేబుల్‌పై పెట్టుకోవడానికి లేదా గోడకు తగిలించుకోవడానికి వీలుగా రూపొందించబడింది.

యాపిల్ హోమ్ వ్యూ ముఖ్యమైన ఫీచర్లు:

డిస్‌ప్లే , ప్రాసెసర్: ఇది 7-ఇంచుల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే మరియు శక్తివంతమైన A18 చిప్‌తో పనిచేస్తుంది.

అధునాతన సిరి AI: ఇందులో ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన సరికొత్త సిరి AI (Siri AI) ఉంది. ఇది మీ ఇంట్లోని మాటలను, అడిగే ప్రశ్నలను సులభంగా అర్థం చేసుకుంటుంది.

ఫేస్ రికగ్నిషన్ : ఈ పరికరం ఇంట్లో ఉండే ఆరుగురు (6) వేర్వేరు వ్యక్తుల ముఖాలను గుర్తించగలదు. ఎవరి ముఖాన్ని గుర్తిస్తే వారికి సంబంధించిన మెసేజ్‌లు, క్యాలెండర్, రిమైండర్‌లతో కూడిన పర్సనలైజ్డ్ హోమ్ స్క్రీన్‌ను చూపిస్తుంది.

స్మార్ట్ హోమ్ కంట్రోల్: దీని ద్వారా ఇంటి సెక్యూరిటీ కెమెరాలు (ఒకేసారి 9 కెమెరా ఫీడ్‌లను చూడవచ్చు), స్మార్ట్ లాక్స్, లైట్లు, థర్మోస్టాట్‌లను వాయిస్ లేదా టచ్ ద్వారా నియంత్రించవచ్చు.

FaceTime , మ్యూజిక్: దీని సాయంతో హ్యాండ్స్-ఫ్రీ ఫేస్‌టైమ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, అలాగే స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో అద్భుతమైన మ్యూజిక్ వినవచ్చు.

భారతదేశంలో ధర మరియు లభ్యత :

యాపిల్ అధికారిక సమాచారం ప్రకారం, భారతదేశంలో Apple HomeView ప్రారంభ ధర ₹39,900 గా నిర్ణయించారు.

ఈ పరికరం కోసం ప్రి-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయినాయి. నవంబర్ 13, 2026 నుండి Apple India Store ద్వారా నేరుగా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement