Breaking News

హైదరాబాద్‌కు చెందిన సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, యూకే ఏరోస్పేస్ దిగ్గజం రోల్స్ రాయిస్తో  ₹3,800 కోట్ల విలువైన భారీ ఒప్పందం

హైదరాబాద్‌కు చెందిన సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (Sigma Advanced Systems), యూకే ఏరోస్పేస్ దిగ్గజం రోల్స్ రాయిస్ (Rolls-Royce) తో దాదాపు ₹3,800 కోట్ల (£300 మిలియన్లు) విలువైన భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 


Published on: 28 Apr 2026 12:21  IST

హైదరాబాద్‌కు చెందిన సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (Sigma Advanced Systems), యూకే ఏరోస్పేస్ దిగ్గజం రోల్స్ రాయిస్ (Rolls-Royce) తో దాదాపు ₹3,800 కోట్ల (£300 మిలియన్లు) విలువైన భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 

ఇది ఏడేళ్ల కాలపరిమితి కలిగిన సుదీర్ఘ వ్యూహాత్మక భాగస్వామ్యం.రోల్స్ రాయిస్ ఏరోస్పేస్ ప్రోగ్రామ్‌ల కోసం అత్యంత ఖచ్చితమైన (high-precision) మరియు రక్షణ పరంగా కీలకమైన (safety-critical) విడిభాగాలు, అసెంబ్లీలను సిగ్మా సరఫరా చేస్తుంది.

ఈ ప్రాజెక్టును సిగ్మా తనకున్న భారత్ మరియు యూకే తయారీ నెట్‌వర్క్ ద్వారా పూర్తి చేస్తుంది.ఈ డీల్ వల్ల సిగ్మా కేవలం విడిభాగాల సరఫరాదారుగానే కాకుండా, గ్లోబల్ ఏరోస్పేస్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగే అవకాశం ఉంది. దీనివల్ల కంపెనీకి సుదీర్ఘ కాలం పాటు స్థిరమైన ఆదాయం లభిస్తుంది.ఈ ప్రకటన వెలువడిన తర్వాత ఏప్రిల్ 27న సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి.

 

Follow us on , &

ఇవీ చదవండి