Breaking News

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ  సంస్థను కొనుగోలు చేసే భారీ ఒప్పందం నుంచి నెట్‌ఫ్లిక్స్ తప్పుకుంటున్నట్లు అధికారిక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్హెచ్చరికలు, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సంచలన నిర్ణయం తీసుకుంది.


Published on: 27 Feb 2026 11:58  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు  , ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సంచలన నిర్ణయం తీసుకుంది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (Warner Bros Discovery) సంస్థను కొనుగోలు చేసే భారీ ఒప్పందం నుంచి నెట్‌ఫ్లిక్స్ తప్పుకుంటున్నట్లు ఫిబ్రవరి 27, 2026న అధికారికంగా ప్రకటించింది. 

నెట్‌ఫ్లిక్స్ బోర్డ్ మెంబర్, మాజీ డెమొక్రాటిక్ అధికారిణి సుసాన్ రైస్ (Susan Rice) ను వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో "తీవ్ర పరిణామాలు" ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ఈ రాజకీయ ఒత్తిడి నెట్‌ఫ్లిక్స్ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

వార్నర్ బ్రదర్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన ఆఫర్ కంటే పారామౌంట్ స్కైడాన్స్ (Paramount Skydance) మెరుగైన ఆఫర్ (షేరుకు $31) ఇచ్చింది. ఈ పెంచిన ధరకు తాము పోటీ పడలేమని, ఈ డీల్ తమకు ఆర్థికంగా గిట్టుబాటు కాదని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది.

పారామౌంట్ ఆఫర్‌ను మ్యాచ్ చేయడానికి నెట్‌ఫ్లిక్స్‌కు 4 రోజుల గడువు ఉన్నప్పటికీ, తాము ఈ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు నెట్‌ఫ్లిక్స్ కో-సీఈఓలు టెడ్ సరాండోస్, గ్రెగ్ పీటర్స్ ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి