Breaking News

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన'టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్, 2026'కు ఆమోదం లభించింది.

సాధారణ వినియోగదారులకు యూపీఐ (UPI) లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు, అవి పూర్తిగా ఉచితం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన'టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్, 2026'కు ఆగస్టు 6న ఆమోదం లభించింది.


Published on: 07 Aug 2026 12:57  IST

సాధారణ వినియోగదారులకు యూపీఐ (UPI) లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు, అవి పూర్తిగా ఉచితం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన'టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్, 2026'కు ఆగస్టు 6న ఆమోదం లభించింది. ఈ బిల్లు వల్ల భవిష్యత్తులో కేవలం పెద్ద వ్యాపారస్తులపై మాత్రమే ఛార్జీలు పడే అవకాశం ఉంది తప్ప, సామాన్య ప్రజలపై కాదు.

ముఖ్యాంశాలు

కస్టమర్లకు పూర్తిగా ఉచితం: మీరు మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు లేదా చిన్న కిరాణా షాపుల్లో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా చేసే సాధారణUPI చెల్లింపులకు రూపాయి కూడా అదనంగా కట్టాల్సిన అవసరం లేదు.  

మర్చంట్ డిస్కౌంట్ రేట్ : కొత్త సవరణ ద్వారా భవిష్యత్తులో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ సంస్థలు కేవలం 'వ్యాపార సంస్థల ' నుంచి మాత్రమే ఈ రుసుమును వసూలు చేసేందుకు చట్టపరమైన వెసులుబాటు కల్పించారు.

రూ. 2,000 పైబడిన లావాదేవీలు: ₹2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై మాత్రమే 0.3% నుండి 0.5% వరకు మర్చంట్ ఛార్జీలు విధించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.

పెద్ద వ్యాపారులకే వర్తింపు: రూ. 1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న పెద్ద షోరూమ్‌లు లేదా మాల్స్ వంటి పెద్ద వ్యాపార సంస్థలకే ఇది వర్తించే అవకాశం ఉంది. చిన్న వ్యాపారులకు దీని నుండి మినహాయింపు ఉంటుంది.

ప్రస్తుతం అమలులో ఉన్న 'పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007' లోని సెక్షన్ 10A ప్రకారం డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు. అయితే, డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత మరియు సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడం కోసం బ్యాంకులకు, ఫిన్‌టెక్ సంస్థలకు కొంత ఆదాయం అవసరం అవుతుంది. ఇందుకోసమే ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించింది.

ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినప్పటికీ, ఛార్జీలను ఎప్పటి నుండి అమలు చేయాలి, ఎంత శాతం విధించాలి అనే విషయాలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. అప్పటివరకు ప్రస్తుత నియమాలే కొనసాగుతాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement