Breaking News

భారతీయ రైల్వే పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్  లో దేశంలోనే తొలిసారిగా 1.3 కిలోమీటర్ల పొడవైన డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలును విజయవంతంగా నడిపింది.

భారతీయ రైల్వే సరుకు రవాణా రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్  లో దేశంలోనే తొలిసారిగా 1.3 కిలోమీటర్ల పొడవైన డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలును విజయవంతంగా నడిపింది.


Published on: 24 Aug 2026 15:15  IST

భారతీయ రైల్వే సరుకు రవాణా రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్  లో దేశంలోనే తొలిసారిగా 1.3 కిలోమీటర్ల పొడవైన డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలును విజయవంతంగా నడిపింది. 2026 ఆగస్టు 21న రాత్రి 7 గంటలకు ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (JNPT) నుంచి బయలుదేరిన ఈ భారీ రైలు, గుజరాత్‌లోని వడోదర డివిజన్ పరిధిలోని వర్ణమా గూడ్స్ టెర్మినల్‌కు చేరుకుంది.

రైలు ప్రత్యేకతలు,సామర్థ్యం

మొత్తం దూరం: ఈ రైలు 422 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

కంటైనర్ల సంఖ్య: ఒకేసారి 360 టీఈయూ (TEU - ట్వంటీ ఫుట్ ఈక్వివలెంట్ యూనిట్స్) కంటైనర్లను తరలించారు.

మొత్తం బరువు: ఈ రైలు మోసుకెళ్లిన సరుకు బరువు 3,922 టన్నులు.

రెండు రైళ్ల అనుసంధానం: రెండు డబుల్ స్టాక్ గూడ్స్ రైళ్లను ఒకే ట్రైన్‌గా  జోడించి నడిపారు. మొదటి భాగంలో 1,817 టన్నుల బరువును, వెనుక భాగంలో 2,105 టన్నుల బరువును రెండు శక్తివంతమైన విద్యుత్ ఇంజన్లు లాగాయి.

ప్రధాన ప్రయోజనాలు

ఖర్చులు మరియు సమయం ఆదా: రెండు అంతస్తులుగా కంటైనర్లను అమర్చడం ద్వారా రవాణా ఖర్చులు దాదాపు 40% నుండి 45% వరకు తగ్గుతాయి.

రద్దీ నివారణ: రేవులలో  మరియు టెర్మినల్స్‌లో కంటైనర్ల నిల్వ సమయం  తగ్గి, సరుకు వేగంగా ఖాళీ అవుతుంది.

పర్యావరణ హితం: ఇది పూర్తిగా విద్యుద్దీకరణ మార్గంలో  నడవడం వల్ల వందలాది డీజిల్ ట్రక్కుల వాడకం తగ్గి, కాలుష్యం భారీగా తగ్గుతుంది.

ఈ విజయవంతమైన ఆపరేషన్ వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన అధికారిక సామాజిక మాధ్యమ వేదికలలో పంచుకున్నారు

 

Follow us on , &

ఇవీ చదవండి