Breaking News

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ Flipkart తన వినియోగదారుల కోసం ఓటీటీ దిగ్గజం Netflix తో జతకట్టి, ఉచిత నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ఆఫర్‌ను అధికారికంగా ప్రకటించింది

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ Flipkart తన వినియోగదారుల కోసం ఓటీటీ దిగ్గజం Netflix తో జతకట్టి, ఉచిత నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ఆఫర్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సరికొత్త లాయల్టీ రివార్డ్ ప్రోగ్రామ్ ఆగస్టు 1, 2026 నుండి పూర్తిగా అందుబాటులోకి రానుంది.


Published on: 31 Jul 2026 19:25  IST

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ Flipkart తన వినియోగదారుల కోసం ఓటీటీ దిగ్గజం Netflix తో జతకట్టి, ఉచిత నెట్ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ఆఫర్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సరికొత్త లాయల్టీ రివార్డ్ ప్రోగ్రామ్ ఆగస్టు 1, 2026 నుండి పూర్తిగా అందుబాటులోకి రానుంది.

ఉచిత నెట్‌ఫ్లిక్స్ ప్లాన్

 4ఆర్డర్లు: ఒక క్యాలెండర్ నెలలో కనీసం 4 సార్లు షాపింగ్ చేయాలి.

కనీస ధర: ప్రతి ఆర్డర్ విలువ కచ్చితంగా రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.Flipkart యాప్, ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ , లేదా ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ లో చేసే ఆర్డర్లకు ఇది వర్తిస్తుంది.

ప్లాన్ చెల్లుబాటు & నిబంధనలు

30 రోజుల వ్యాలిడిటీ: మీ 4వ ఆర్డర్ విజయవంతంగా పూర్తయిన నాటి నుండి 30 రోజుల పాటు ఈ మొబైల్ ప్లాన్ ఉచితంగా పనిచేస్తుంది.

ప్రతి నెల ఉచితం: తదుపరి నెలలో మళ్లీ 4 ఆర్డర్లు పూర్తి చేయడం ద్వారా ప్రతి నెలా ఈ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించవచ్చు.

మొబైల్ స్క్రీన్ మాత్రమే: ఇది నెట్‌ఫ్లిక్స్ 'మొబైల్ ప్లాన్' కాబట్టి కేవలం ఒక మొబైల్ లేదా టాబ్లెట్‌లో మాత్రమే చూసేందుకు వీలవుతుంది.

ప్లస్ మెంబర్లు : ప్రస్తుతం ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు నేరుగా లభిస్తుంది.

ప్లస్ సభ్యులు కానివారు: మీరు ప్లస్ మెంబర్ కాకపోయినా ఈ ప్రయోజనం పొందవచ్చు. ఇందుకోసం ఏడాది కాలంలో కనీసం 15 ఆర్డర్లు పూర్తి చేసి ప్లస్ మెంబర్‌షిప్ సాధించాల్సి ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement