Breaking News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్పొరేట్ మరియు కస్టమర్లతో నేరుగా సంబంధం లేని విభాగాల ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తమ కార్పొరేట్ మరియు కస్టమర్లతో నేరుగా సంబంధం లేని విభాగాల ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) ఆప్షన్ ఇస్తున్నట్లు ప్రకటించింది.


Published on: 20 May 2026 17:17  IST

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తమ కార్పొరేట్ మరియు కస్టమర్లతో నేరుగా సంబంధం లేని విభాగాల ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) ఆప్షన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం (Crude Oil Crisis), పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధనాన్ని పొదుపు చేయాలని, కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ హైబ్రిడ్ వర్క్ విధానం ప్రస్తుతానికి 30 రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పనితీరును సమీక్షించి దీనిని పొడిగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు.ఈ నిబంధన తక్షణమే (మే 20, 2026 నుండి) అమల్లోకి వస్తుంది.

కస్టమర్లతో నేరుగా ముఖాముఖి సంబంధం లేని అంతర్గత విభాగాలైన ఐటీ (IT), ఫైనాన్స్, ట్రెజరీ ఆపరేషన్స్, డిజిటల్ బ్యాంకింగ్, హెచ్ఆర్ (HR), రిస్క్ అండ్ కంప్లయన్స్ ఉద్యోగులకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది.బ్యాంకు బ్రాంచ్‌లలో పనిచేసే సిబ్బందికి, క్యాష్ కౌంటర్లు మరియు కస్టమర్లతో నేరుగా వ్యవహరించే ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగులకు ఇది వర్తించదు.ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు అందే బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు అని హెచ్‌డీఎఫ్‌సీ స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి