Breaking News

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) భారీ స్థాయిలో  8,000 మంది ఉద్యోగాల తొలిగింపు

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) ఈ ఏడాది భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.


Published on: 20 Apr 2026 11:46  IST

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) ఈ ఏడాది భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.తాజా సమాచారం ప్రకారం, మెటా తన మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతం మందిని, అంటే సుమారు 8,000 మందిని మే 20 నుండి ప్రారంభమయ్యే తొలి విడతలో తొలగించే అవకాశం ఉంది.

ఈ ఏడాది ద్వితీయార్థంలో మరిన్ని విడతల్లో ఉద్యోగులను తగ్గించాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, సుమారు 20 శాతం వరకు సిబ్బందిపై వేటు పడొచ్చని అంచనా.ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై కంపెనీ పెంచుతున్న పెట్టుబడులు మరియు కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఏఐ వల్ల గతంలో పెద్ద బృందాలు చేసిన పనులు ఇప్పుడు అతి తక్కువ మందితోనే పూర్తవుతుండటం దీనికి ఒక కారణంగా భావిస్తున్నారు.ప్రధానంగా సేల్స్, రిక్రూటింగ్, రియాలిటీ ల్యాబ్స్ మరియు మిడిల్ మేనేజ్‌మెంట్ విభాగాల్లోని ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 

Follow us on , &

ఇవీ చదవండి