Breaking News

డిజిటల్ పేమెంట్స్‌కి ఓటీపీ లేనట్లేనా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం నిర్ణయాల్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే రెపో రేట్లను వరుసగా ఆరోసారి కూడా యథాతథంగా ఉండగా.. మరికొన్ని కీలక విషయాలు వెల్లడించింది. డిజిటల్ పేమెంట్స్ ధ్రువీకరణ కోసం కొత్త విధానం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.


Published on: 08 Feb 2024 18:31  IST

ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది, త్వరలో డిజిటల్ చెల్లింపుల ధ్రువీకరణ కోసం మరో కొత్త మెకానిజం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. డిజిటల్ పేమెంట్స్ చెల్లింపులకు మరింత భద్రత  కల్పించే ఉద్దేశంతోనే ఈ విధానం తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ద్వైమాసిక సమావేశం సమీక్ష నిర్ణయాల్ని ప్రకటించిన సందర్భంగానే ఈ విషయం గురించి చెప్పారు. ఇప్పటివరకు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నపుడు.. పేమెంట్ ధ్రువీకరించేందుకు ఓటీపీ వినియోగిస్తుంటాం. దాదాపుగా అన్ని బ్యాంకులు ఇదే విధానం అనుసరిస్తున్నాయి.ఇప్పుడు ఆర్‌బీఐ కొత్త విధానం ప్రకటించింది.
కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వంతో సహా రిజర్వ్ బ్యాంక్ కూడా డిజిటల్ పేమెంట్స్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి ట్రాన్సాక్షన్ల భద్రత కోసం అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్‌ను బ్యాంకులకు సూచిస్తుంది. దీనితో చాలా వరకు బ్యాంకులు ఓటీపీ ఆధారిత విధానం అనుసరిస్తున్నాయి. డిజిటల్ పేమెంట్స్‌కు మరింత భద్రత తీసుకొచ్చేందుకు విధిగా అనుసరించేలా కొత్త ఫ్రేమ్‌వర్క్ తీసుకురానున్నట్లు తేలిపారు. 
టెక్నాలజీ వృద్ధి చెందుతున్న వేళ ప్రత్యామ్నాయ విధానాలు కూడా అందుబాటులోకి వచ్చినట్లు శక్తికాంత దాస్ పేర్కొన్నారు. త్వరలో దీనికి సంబంధించి ఆదేశాలు విడిగా జారీ చేస్తామని  శక్తికాంత దాస్  చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి