Breaking News

వాట్సాప్ గ్రూప్ చాట్ వినియోగదారుల కోసం మెటా సంస్థ సరికొత్త ఫీచర్లను అధికారికంగా విడుదల చేసింది

వాట్సాప్ గ్రూప్ చాట్ వినియోగదారుల కోసం మెటా సంస్థ ఆగస్టు 4, 2026న సరికొత్త ఫీచర్లను అధికారికంగా విడుదల చేసింది. గ్రూపుల్లో నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి, ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ చేరవేయడానికి ఈ అప్‌డేట్లు ఎంతో ఉపయోగపడతాయి.


Published on: 05 Aug 2026 19:25  IST

వాట్సాప్ గ్రూప్ చాట్ వినియోగదారుల కోసం మెటా సంస్థ ఆగస్టు 4, 2026న సరికొత్త ఫీచర్లను అధికారికంగా విడుదల చేసింది. గ్రూపుల్లో నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి, ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ చేరవేయడానికి ఈ అప్‌డేట్లు ఎంతో ఉపయోగపడతాయి. ఈ సరికొత్త అప్‌డేట్లలో పోల్స్ ఫీచర్‌కు 3 కొత్త మార్పులు, అలాగే @all, సిమిలర్ గ్రూప్ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

పోల్స్ లో వచ్చిన 3 కొత్త అప్‌డేట్లు

వాట్సాప్ గ్రూప్ పోల్స్ ప్రక్రియను మరింత సులభతరం మరియు సురక్షితం చేయడానికి ఈ 3 మార్పులు చేశారు:

ఓటింగ్ ముగింపు సమయం : ఇకపై గ్రూప్‌లో పోల్ క్రియేట్ చేసేటప్పుడే అది ఎప్పుడు ముగియాలో ఒక నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. ఆ టైమ్ పూర్తి కాగానే ఓటింగ్ ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతుంది.

ఓటర్ల పేర్ల గోప్యత : పోల్‌లో ఎవరు ఏ ఆప్షన్‌కు ఓటు వేశారనే విషయాన్ని గ్రూప్‌లోని ఇతరులకు కనిపించకుండా దాచవచ్చు .దీనివల్ల సభ్యులు ఎలాంటి మొహమాటం లేకుండా తమ అభిప్రాయాన్ని చెప్పగలరు.

పోల్ ఎడిట్ ఆప్షన్ : ఒకవేళ పోల్ క్రియేట్ చేసిన తర్వాత ప్రశ్నలో ఏవైనా తప్పులు దొర్లితే , దాన్ని డిలీట్ చేయకుండానే 15 నిమిషాల లోపు ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని తెచ్చారు.

@all మెన్షన్ ఫీచర్

గ్రూప్‌లో ఏదైనా అత్యవసరమైన లేదా ముఖ్యమైన సమాచారాన్ని ఒకేసారి అందరికీ తెలియజేయడానికి ఈ @all ఆప్షన్ ఉపయోగపడుతుంది.

గ్రూప్ చాట్‌లో కేవలం @all అని టైప్ చేసి మెసేజ్ పంపితే, గ్రూప్‌లోని సభ్యులందరికీ ఒకేసారి నోటిఫికేషన్ వెళ్తుంది.

పరిమితి: గ్రూప్‌ను ఎవరైనా 'మ్యూట్' చేసి ఉంచినా కూడా @all మెసేజ్ వస్తే అలర్ట్ వెళ్తుంది. అయితే, యూజర్లు కావాలనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ ప్రత్యేక అలర్ట్‌లను కూడా మ్యూట్ చేసుకోవచ్చు.

అడ్మిన్లకే ఛాన్స్: 32 కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న పెద్ద గ్రూపులలో కేవలం గ్రూప్ అడ్మిన్లు మాత్రమే ఈ ఫీచర్‌ను ఉపయోగించగలరు.

సిమిలర్ గ్రూప్ క్రియేషన్

ప్రస్తుతం ఉన్న ఒక గ్రూప్ నుండి కొంతమంది సభ్యులను ఎంచుకుని, సింగిల్ ట్యాప్‌తో వెంటనే మరొక కొత్త గ్రూప్‌ను క్రియేట్ చేయవచ్చు.ప్రతి ఒక్కరినీ విడివిడిగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, ఒక గ్రూప్‌లో ఉన్న స్నేహితుల్లో ఒకరికి సర్ప్రైజ్ బర్త్‌డే పార్టీ ప్లాన్ చేయాలనుకుంటే, ఆ వ్యక్తిని మినహాయించి మిగిలిన వారందరితో ఒకే క్లిక్‌తో కొత్త గ్రూప్ ఏర్పాటు చేసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది.

 

Follow us on , &

ఇవీ చదవండి