Breaking News

వాట్సాప్ వెబ్ మరియు డెస్క్‌టాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దేశంలో భారీ ఎత్తున మాల్‌వేర్ దాడులు జరుగుతున్నాయని భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ CERT-In తీవ్ర హెచ్చరికలు

వాట్సాప్ వెబ్ (WhatsApp Web) మరియు డెస్క్‌టాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దేశంలో భారీ ఎత్తున మాల్‌వేర్ దాడులు జరుగుతున్నాయని భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ CERT-In తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.


Published on: 30 Jun 2026 14:12  IST

వాట్సాప్ వెబ్ (WhatsApp Web) మరియు డెస్క్‌టాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దేశంలో భారీ ఎత్తున మాల్వేర్ దాడులు జరుగుతున్నాయని భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ CERT-In తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.సైబర్ నేరగాళ్లు యూజర్ల కంప్యూటర్లు, లాప్‌టాప్‌లను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఈ కొత్త రకం వ్యూహాన్ని ఉపయోగిస్తున్నారు.

మాల్‌వేర్ దాడి ఎలా జరుగుతుంది

నకిలీ ఫైల్స్: హ్యాకర్లు విజువల్ బేసిక్ స్క్రిప్ట్ (VBScript) కోడింగ్ ఉన్న ఫైళ్లను ఇన్వాయిస్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, లేదా పేమెంట్ రికార్డుల పేరుతో పంపుతున్నారు.

నమ్మకమైన ఖాతాల ద్వారా: మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగుల వాట్సాప్ ఖాతాలు ఇప్పటికే హ్యాక్ అయి ఉంటే, వారి ఖాతాల నుంచే ఈ ప్రమాదకరమైన ఫైల్స్ (ఉదాహరణకు 'simple.vbs') మీకు వస్తాయి.

రిమోట్ యాక్సెస్: యూజర్ ఆ ఫైల్‌ను క్లిక్ చేసి రన్ చేయగానే, హ్యాకర్లకు సదరు కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌పై పూర్తి నియంత్రణ లభిస్తుంది.

దీని వల్ల వచ్చే నష్టాలు ఏమిటి

సైబర్ నేరగాళ్లు మీ పరికరంలోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లను దొంగిలిస్తారు.

మీ సిస్టమ్‌ను ఉపయోగించి వారు మరిన్ని ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉంది.

మీ లాప్‌టాప్ కనెక్ట్ అయి ఉన్న హోమ్ వై-ఫై లేదా ఆఫీస్ నెట్‌వర్క్ మొత్తాన్ని ఈ మాల్‌వేర్ నాశనం చేయగలదు.

సురక్షితంగా ఉండటానికి CERT-In సూచనలు:

అటాచ్‌మెంట్లను జాగ్రత్తగా చూడండి: వాట్సాప్‌లో వచ్చే ఎటువంటి తెలియని ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దు. ముఖ్యంగా .vbs, .vbe, .exe, .bat, .js వంటి ఎక్స్‌టెన్షన్‌లు ఉన్న ఫైళ్లను అస్సలు ఓపెన్ చేయకండి.

ధృవీకరించుకోండి: మీకు తెలిసిన వారి నుంచి అనుమానాస్పద ఫైల్ వస్తే, దాన్ని ఓపెన్ చేసే ముందు వారికి ఫోన్ చేసి అది వారే పంపించారా లేదా అనేది నిర్ధారించుకోండి.

యాక్టివ్ సెషన్స్ తనిఖీ చేయండి: మీ వాట్సాప్ మొబైల్ యాప్‌లో 'Linked Devices' ఆప్షన్‌లోకి వెళ్లి, మీకు తెలియని ఏదైనా కంప్యూటర్ లాగిన్ అయి ఉంటే వెంటనే Log Out చేయండి.

యాంటీవైరస్ వాడండి: మీ కంప్యూటర్లలో మంచి సెక్యూరిటీ లేదా యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోండి.

 

Follow us on , &

ఇవీ చదవండి