Breaking News

ఇన్‌ఫోసిస్ తన తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మరియు మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా సంస్థకు చెందిన సీనియర్ లీడర్ ఆశిష్ కుమార్ డాష్‌ను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది

దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన ఇన్‌ఫోసిస్ తన తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మరియు మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా సంస్థకు చెందిన సీనియర్ లీడర్ ఆశిష్ కుమార్ డాష్‌ను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.


Published on: 23 Jul 2026 19:13  IST

దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన ఇన్ఫోసిస్ తన తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మరియు మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా సంస్థకు చెందిన సీనియర్ లీడర్ ఆశిష్ కుమార్ డాష్ను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.

బాధ్యతల స్వీకరణ: ఆశిష్ కుమార్ డాష్ 2027 ఏప్రిల్ 1 నుండి పూర్తిస్థాయి సీఈఓగా బాధ్యతలు చేపడతారు. అప్పటి వరకు ఆయన 'సీఈఓ డిజిగ్నేట్' గా కొనసాగుతారు.

ప్రస్తుతం ఇన్‌ఫోసిస్ సీఈఓగా ఉన్న సలీల్ పరేఖ్ ఐదేళ్ల పదవీ కాలం 2027 మార్చి 31తో ముగియనుంది. అప్పటివరకు ఆయన తన పదవిలో కొనసాగుతారు. కంపెనీ చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన నాన్-ఫౌండర్ సీఈఓగా సలీల్ నిలవనున్నారు.షేర్‌హోల్డర్ల ఆమోదానికి లోబడి ఆశిష్ కుమార్ దాస్ ఈ పదవిలో 5 సంవత్సరాల పాటు కొనసాగుతారు.

ఆశిష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్: ఆయన దాదాపు 3 దశాబ్దాలుగా (30 ఏళ్లు) ఇన్‌ఫోసిస్‌లో వివిధ కీలక హోదాల్లో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇన్‌ఫోసిస్ గ్లోబల్ హెడ్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సాంకేతిక మార్పుల తదుపరి దశలోకి ఐటీ రంగం ప్రవేశిస్తున్న తరుణంలో, సంస్థను సమర్థవంతంగా నడిపించడానికి బోర్డు ఛైర్మన్ నందన్ నీలేకని నేతృత్వంలోని బోర్డు ఈ అంతర్గత నియామకాన్ని ఖరారు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి