Breaking News

భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తులపై తప్పుడు ప్రకటనలు , లేబ్లింగ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు గానూ లోట్టే ఇండియా సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది

భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తులపై తప్పుడు ప్రకటనలు , లేబ్లింగ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు గానూ లోట్టే ఇండియా తో పాటు మరో రెండు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.


Published on: 09 Jul 2026 12:35  IST

భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తులపై తప్పుడు ప్రకటనలు , లేబ్లింగ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు గానూ లోట్టే ఇండియా తో పాటు మరో రెండు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఆహార భద్రత ప్రమాణాల చట్టం-2006 నిబంధనల ప్రకారం.. ఈ నోటీసులపై 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సదరు కంపెనీలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది.

నోటీసులు అందుకున్న 3 సంస్థలు మరియు వాటిపై వచ్చిన ఆరోపణలు:

లోట్టే ఇండియా కార్పొరేషన్ :

పాత పేరు వాడకం: ముందస్తు అనుమతి లేకుండా ప్యాకింగ్‌పై కంపెనీ పాత పేరు అయిన "Lotte India Corporation Ltd" ను ఉపయోగించడం.

తప్పుడు వెజిటేరియన్ క్లెయిమ్: లోట్టే చాకో పై ఉత్పత్తులపై వేసిన '100% వెజిటేరియన్' మార్క్ వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉందని FSSAI గుర్తించింది.

పండ్ల అంశంపై భ్రమలు: 'ఫ్రూట్జ్ ఎక్లైర్స్' చాక్లెట్లలో అసలు పండ్ల కంటెంట్ లేకపోయినా, పేరు ద్వారా పండ్లు ఉన్నాయనే తప్పుడు నమ్మకాన్ని కలిగిస్తున్నారు.

పోషకాల సమాచారం లోపించడం: పెపెరో బిస్కట్ స్టిక్స్ పై పోషక విలువల వివరాలను సరైన ఫార్మాట్‌లో ఇవ్వలేదు.

విటమిన్ల లోపం: 'లాలీ బ్లిస్ లాలిపాప్' లో పేర్కొన్న విటమిన్ల స్థాయిలు నిబంధనలకు అనుగుణంగా లేవు.

కుబేర ఫుడ్స్ :

ఈ సంస్థకు చెందిన 'సాఫ్ట్ అండ్ ఫ్రెష్ క్రీమ్ బన్ పైనాపిల్' ప్యాకెట్‌పై '100% నేచురల్', 'నో ప్రిజర్వేటివ్స్, కలర్స్ & ఫ్లేవర్స్' అని ముద్రించారు.కానీ, అదే లేబుల్‌పై ప్రిజర్వేటివ్స్ , సింథటిక్ ఫుడ్ కలర్ , అదనపు ఫ్లేవర్స్ వాడినట్లు రాయడంతో ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించే క్లెయిమ్ అని FSSAI తేల్చింది.

ఫెర్న్స్ ఎన్ పెటల్స్:

వీరి 'రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్' ను 'ప్రీమియం చాక్లెట్' గా ప్రచారం చేశారు.అయితే, కోకో బట్టర్‌కు బదులుగా ఇందులో 'హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఫ్యాట్' ఉపయోగించినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన తప్పనిసరి డిక్లరేషన్‌ను లేబుల్‌పై ఇవ్వలేదు.ప్యాకెట్‌పై బాదం చిత్రాలను ప్రముఖంగా చూపించినప్పటికీ, పదార్థాల జాబితాలో బాదం శాతం ఎంతో పేర్కొనలేదు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement