Breaking News

పోస్టల్ నెక్స్ట్ డే డెలివరీ వచ్చే ఏడాది మొదలు

భారత పోస్టల్ శాఖ వచ్చే ఏడాది జనవరి నుంచి 24 నుంచి 48 గంటల్లోగా పార్శిల్, ఉత్తరాల డెలివరీ కోసం నెక్ట్స్‌డే డెలివరీ సేవలను ప్రారంభించనుంది.


Published on: 17 Oct 2025 14:51  IST

భారత పోస్టల్ శాఖ వచ్చే ఏడాది జనవరి నుంచి 24 నుంచి 48 గంటల్లోగా పార్శిల్, ఉత్తరాల డెలివరీ కోసం నెక్ట్స్‌డే డెలివరీ సేవలను ప్రారంభించనుంది. ఈ కొత్త సేవలకు శ్రీకారం చుట్టనున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. 

పోస్టల్ సేవలను మరింత వేగవంతం చేసి, 24-48 గంటల్లోగా డెలివరీ చేసేందుకు హామీ ఇస్తారు.ప్రస్తుతం పోస్టల్ ద్వారా పార్శిల్స్ డెలివరీ అవ్వడానికి 3 నుంచి 5 రోజులు పడుతోంది.ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పోటీ పడేందుకు, ఈ-కామర్స్ తరహాలో వేగవంతమైన సేవలను అందించేందుకు తపాలా శాఖ ఈ సేవలను ప్రారంభిస్తోంది.వేగవంతమైన డెలివరీ కోసం, ఇ-కామర్స్ టెక్నాలజీని ఉపయోగించి ప్యాకేజీలను ట్రాక్ చేసే సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ చర్యల ద్వారా పోస్టల్ శాఖ తన సామర్థ్యాన్ని, విశ్వసనీయతను మెరుగుపరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి