Breaking News

భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 జులై 4 నుండి జులై 6 వరకు మూడు రోజుల పాటు జరగనుంది.

భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 తేదీలను ఈరోజు (18 జూన్ 2026న) అధికారికంగా ఖరారు చేశారు. ఈ ఏడాది ప్రైమ్ డే సేల్ జులై 4 నుండి జులై 6 వరకు మూడు రోజుల పాటు జరగనుంది.


Published on: 18 Jun 2026 18:44  IST

భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 తేదీలను ఈరోజు (18 జూన్ 2026న) అధికారికంగా ఖరారు చేశారు. ఈ ఏడాది ప్రైమ్ డే సేల్ జులై 4 నుండి జులై 6 వరకు మూడు రోజుల పాటు జరగనుంది.

సేల్ టైమింగ్స్

ప్రారంభం: జులై 4వ తేదీ అర్ధరాత్రి 12:00 గంటలకు.

ముగింపు: జులై 6వ తేదీ రాత్రి 11:59 నిమిషాలకు.

బ్యాంక్ ఆఫర్లు & డిస్కౌంట్ల

అదనపు తగ్గింపు: ఎస్‌బీఐ (SBI), యాక్సిస్  బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

క్యాష్‌బ్యాక్: అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 5% క్యాష్‌బ్యాక్ ఉంటుంది.

తగ్గిన ప్రైమ్ మెంబర్‌షిప్ ధరలు

ఈ 10వ ఎడిషన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా కొత్తగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వారి కోసం అమెజాన్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది:

వార్షిక ప్ర్లాన్ : సాధారణ ధర రూ.1,499 ఉండగా, దానిని రూ.999 కి తగ్గించారు.

ప్రైమ్ లైట్ ప్లాన్ : సాధారణ ధర రూ.799 నుండి రూ.599 కి తగ్గించారు.

ఆఫర్ల వివరాలు

వన్‌ప్లస్, శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన 500 కంటే ఎక్కువ కొత్త ప్రొడక్ట్స్‌ ఈ సేల్‌లో లాంచ్ కానున్నాయి.

ఎకో స్మార్ట్ స్పీకర్స్, అలెక్సా, ఫైర్ టీవీ వంటి అమెజాన్ డివైజ్‌లపై 45 శాతం వరకు భారీ డిస్కౌంట్లు లభిస్తాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement