Breaking News

టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ , 4జీ మరియు 5జీ సేవలకు వేర్వేరు టారిఫ్‌లు వసూలు చేసుకునేలా సరికొత్త ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది

టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ , 4జీ మరియు 5జీ సేవలకు వేర్వేరు టారిఫ్‌లు వసూలు చేసుకునేలా సరికొత్త ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. నెట్‌వర్క్ స్లైసింగ్  సాంకేతికత ఆధారంగా టెలికాం కంపెనీలు ఇకపై వేగం మరియు నాణ్యతను బట్టి 4G, 5G ఆఫర్లకు వేర్వేరు ఛార్జీలను నిర్ణయించుకోవచ్చు.


Published on: 06 Aug 2026 12:16  IST

టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ , 4జీ మరియు 5జీ సేవలకు వేర్వేరు టారిఫ్లు వసూలు చేసుకునేలా సరికొత్త ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. నెట్‌వర్క్ స్లైసింగ్  సాంకేతికత ఆధారంగా టెలికాం కంపెనీలు ఇకపై వేగం మరియు నాణ్యతను బట్టి 4G, 5G ఆఫర్లకు వేర్వేరు ఛార్జీలను నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం వినియోగదారులు 4జీ, 5జీ సేవలకు ఒకే రకమైన ప్లాన్ ధరలను చెల్లిస్తుండగా, ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే 5G ప్లాన్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

దీనితో పాటు, జియో మరియు ఎయిర్‌టెల్ కంపెనీలు తమ ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్ల ధరలను కూడా 12% నుండి 15% వరకు పెంచడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మార్కెట్ నివేదికలు సూచిస్తున్నాయి.

ప్రస్తుత అంచనాల ప్రకారం మారబోయే టారిఫ్ వివరాలు మరియు ట్రాయ్ కొత్త నిబంధనల ముఖ్యాంశాలు కింద ఇవ్వబడ్డాయి:

ట్రాయ్ కొత్త నిబంధనల

వేర్వేరు ధరలు: టెలికాం ఆపరేటర్లు 4జీ మరియు 5జీ ఇంటర్నెట్ సేవలకు విడివిడిగా టారిఫ్‌లను ప్రకటించవచ్చు.

నిర్దిష్ట స్పీడ్ హామీ: ప్లాన్ ఆఫర్ చేసేటప్పుడు కస్టమర్లకు ఎంత డౌన్‌లోడ్/అప్‌లోడ్ స్పీడ్ వస్తుందో కంపెనీలు స్పష్టంగా చెప్పాలి.

80% నిబంధన: కంపెనీ ప్రకటనల్లో పేర్కొన్న వేగం కంటే 80% తక్కువ స్పీడ్ వస్తే, దానిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు.

నాణ్యత రక్షణ: అదనపు డబ్బులు చెల్లించని సాధారణ కస్టమర్లకు కూడా నెట్‌వర్క్ నాణ్యత తగ్గకుండా కంపెనీలు జాగ్రత్తలు తీసుకోవాలి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement