Breaking News

నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌.. నష్టాల్లో ముగిసిన బెంచ్‌మార్క్‌ సూచీలు..!

Stock Market | దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం మార్కెట్లు నష్టాలతోనే మొదలయ్యాయి. ఏ దశలోనూ మద్దతు లేకపోవడంతో కోలుకోలేకపోయాయి. నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌ వేస్తూ.. స్టాక్‌ మార్కెట్లు మే నెలకు నష్టాలతో ముగింపు పలికాయి.


Published on: 31 May 2023 17:29  IST

Stock Market | దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం మార్కెట్లు నష్టాలతోనే మొదలయ్యాయి. ఏ దశలోనూ మద్దతు లేకపోవడంతో కోలుకోలేకపోయాయి. నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌ వేస్తూ.. స్టాక్‌ మార్కెట్లు మే నెలకు నష్టాలతో ముగింపు పలికాయి. సెన్సెక్స్‌ నష్టాలతో 62,839.97 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. చివరకు 346.89 పాయింట్ల నష్టంతో 62,622.24 వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 18,594.20 వద్ద ప్రారంభమై.. చివరకు 99.45 పాయింట్లు నష్టపోయి 18,534.40 దగ్గర స్థిరపడింది.

అయితే, అమెరికాలో అప్పుల పరిమితి పెంపు బిల్లు ఓటింగ్‌కు రానుండడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అప్రమత్తత నేపథ్యంలో.. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం కనిపించింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 6పైసలు పతనమై 82.73 దగ్గర స్థిరపడింది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో దాదాపు 1679 షేర్లు పురోగమించగా, 1733 షేర్లు క్షీణించాయి. 133 షేర్లు మారలేదు.
నిఫ్టీలో ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ అత్యధికంగా నష్టపోగా.. భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లాభపడ్డాయి.

సెన్సెక్‌లో భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, కోటక్‌
మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టైటన్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్టీ, హెల్త్‌కేర్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి.

Follow us on , &

Source From: BS News

ఇవీ చదవండి