Breaking News

కేంద్ర ప్రభుత్వం సరికొత్త న్యూ ఆధార్ యాప్ (New Aadhaar App) ఫుల్ వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వం 2026, జనవరి 28న సరికొత్త న్యూ ఆధార్ యాప్ (New Aadhaar App) ఫుల్ వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది.


Published on: 28 Jan 2026 15:41  IST

కేంద్ర ప్రభుత్వం 2026, జనవరి 28న సరికొత్త న్యూ ఆధార్ యాప్ (New Aadhaar App) ఫుల్ వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. యూఐడీఏఐ (UIDAI) ద్వారా రూపొందించబడిన ఈ యాప్, ఆధార్ సేవలను మరింత సురక్షితంగా మరియు సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆధార్ సెంటర్లకు వెళ్లకుండానే, ఇంటి వద్ద నుండే స్మార్ట్‌ఫోన్ ద్వారా మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. దీని కోసం ఫేస్ అథెంటికేషన్ (Face Authentication) ప్రక్రియను ప్రవేశపెట్టారు.

ఇకపై ఫిజికల్ ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. యాప్‌లోని క్యూఆర్ (QR) కోడ్ ద్వారా ఎక్కడైనా మీ గుర్తింపును ధృవీకరించుకోవచ్చు.ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ఆధార్ వివరాలను ధృవీకరించుకునే సౌకర్యం ఉంది.

అవసరమైన వివరాలను మాత్రమే (ఉదాహరణకు కేవలం ఫోటో లేదా పుట్టిన తేదీ) ఇతరులకు షేర్ చేసి, మిగిలిన వాటిని దాచవచ్చు.మీ పేరు, చిరునామా మరియు ఇతర వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి మరియు ఐఫోన్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ నుండి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న పాత యాప్‌ను డిలీట్ చేసి, ఈ కొత్త వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి