Breaking News

వాట్సాప్ తన వినియోగదారుల ప్రైవసీని మరింత పెంచడానికి "యూజర్‌నేమ్ రిజర్వేషన్" అనే సరికొత్త ఫీచర్‌ను అధికారికంగా ప్రకటించింది.

వాట్సాప్ తన వినియోగదారుల ప్రైవసీని మరింత పెంచడానికి "యూజర్‌నేమ్ రిజర్వేషన్" అనే సరికొత్త ఫీచర్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ అప్‌డేట్ ద్వారా మీరు మీ ఫోన్ నంబర్ ఇతరులకు కనిపించకుండా కేవలం యూజర్‌నేమ్ ద్వారానే చాట్ చేసుకోవచ్చు.


Published on: 30 Jun 2026 11:34  IST

వాట్సాప్ తన వినియోగదారుల ప్రైవసీని మరింత పెంచడానికి "యూజర్నేమ్ రిజర్వేషన్" అనే సరికొత్త ఫీచర్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ అప్‌డేట్ ద్వారా మీరు మీ ఫోన్ నంబర్ ఇతరులకు కనిపించకుండా కేవలం యూజర్‌నేమ్ ద్వారానే చాట్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్ దశలవారీగా రోల్‌అవుట్ అవుతోంది. అందరికీ అందుబాటులోకి వచ్చేలోపే మీకు నచ్చిన పేరును ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు.

కొత్త ఫీచర్ ముఖ్యమైన వివరాలు:

నెంబర్ షేరింగ్ అవసరం లేదు: కొత్త వ్యక్తులతో, గ్రూపుల్లో లేదా బిజినెస్ అకౌంట్స్‌తో చాట్ చేసేటప్పుడు మీ వ్యక్తిగత మొబైల్ నంబర్ అవతలి వారికి కనిపించదు.

ఖచ్చితమైన పేరుండాలి: ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాగా ఇందులో పబ్లిక్ సెర్చ్ డైరెక్టరీ ఉండదు. ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ ఖచ్చితమైన యూజర్‌నేమ్ తెలిసి ఉండాలి.

మెటా అకౌంట్ కనెక్టివిటీ: క్రియేటర్లు లేదా బిజినెస్ రన్ చేసేవారు తమ ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ యూజర్‌నేమ్‌లనే వాట్సాప్‌లో కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.

యూజర్‌నేమ్ కీ: అదనపు సెక్యూరిటీ కోసం ఒక 4-అంకెల పిన్ (Key) సెట్ చేసుకోవచ్చు. ఈ కీ తెలిసిన వారు మాత్రమే మీకు మొదటిసారి మెసేజ్ చేయగలరు.

నియమాలు: యూజర్‌నేమ్ 3 నుండి 35 అక్షరాల మధ్య ఉండాలి. కేవలం చిన్న అక్షరాలు (lowercase), నంబర్లు, డాట్స్ (.), మరియు అండర్‌స్కోర్స్ (_) మాత్రమే వాడాలి.

యూజర్‌నేమ్ ఎలా రిజర్వ్ చేసుకోవాలి

మీ అకౌంట్‌కు ఈ ఫీచర్ వచ్చిందో లేదో చెక్ చేయడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:

మీ మొబైల్‌లో Google Play Store లేదా App Store ఓపెన్ చేసి వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.వాట్సాప్ ఓపెన్ చేసి Settings లోకి వెళ్ళండి.Account పై క్లిక్ చేయండి.

అక్కడ Username అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై టాప్ చేయండి.

మీకు కావాల్సిన పేరును టైప్ చేసి, అది అందుబాటులో ఉంటే Save/Reserve చేసుకోండి.

 

Follow us on , &

ఇవీ చదవండి