Breaking News

తెలంగాణ రోడ్లు మరియు భవనాల (R&B) శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తోంది

తెలంగాణ రోడ్లు మరియు భవనాల (R&B) శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తోంది.


Published on: 07 Jul 2026 18:45  IST

తెలంగాణ రోడ్లు మరియు భవనాల (R&B) శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తోంది.

ఖాళీల వివరాలు

R&B శాఖలో మొత్తం 271 AEE పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది:

AEE (సివిల్) - 222 పోస్టులు (నోటిఫికేషన్ నం: 01/G/RB/2026)

AEE (ఎలక్ట్రికల్) - 49 పోస్టులు (నోటిఫికేషన్ నం: 02/G/RB/2026)

ముఖ్యమైన తేదీలు

AEE సివిల్ దరఖాస్తుకు చివరి తేదీ: 13 జూలై 2026 (సాయంత్రం 5:00 వరకు)

AEE ఎలక్ట్రికల్ దరఖాస్తుకు చివరి తేదీ: 15 జూలై 2026 (సాయంత్రం 5:00 వరకు)

రాత పరీక్ష తేదీ: అక్టోబర్ 2026  

అర్హతలు & వయోపరిమితి

విద్యార్హత:

సివిల్ పోస్టులకు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E / B.Tech (Civil Engineering) లేదా తత్సమాన అర్హత (AMIE) ఉండాలి.

ఎలక్ట్రికల్ పోస్టులకు: B.E / B.Tech పూర్తి చేసి ఉండాలి.

వయస్సు: 1 జూలై 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.

జీతం & ఎంపిక విధానం

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 54,220 నుండి రూ. 1,33,630 వరకు పే-స్కేల్ లభిస్తుంది.

ఎంపిక విధానం: ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు, కేవలం ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు

ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు: రూ. 1000 (OC/BC లకు), రూ. 500 (SC/ST/PWD అభ్యర్థులకు).

పరీక్ష ఫీజు: రూ. 120 (నిరుద్యోగ అభ్యర్థులకు ఈ రూ. 120 పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఉంది).

 

Follow us on , &

ఇవీ చదవండి