Breaking News

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ నుండి నాన్-ఎగ్జిక్యూటివ్ మరియు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యాయి

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ నుండి ఆగస్టు 2026 చివరి వారంలో నాన్-ఎగ్జిక్యూటివ్ మరియు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 8, 2026 వరకు సమయం ఉంది.


Published on: 01 Sep 2026 20:56  IST

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ నుండి ఆగస్టు 2026 చివరి వారంలో నాన్-ఎగ్జిక్యూటివ్ మరియు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 8, 2026 వరకు సమయం ఉంది.

BEML నాన్-ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2026

మొత్తం పోస్టులు: 10

అర్హత: ఎలక్ట్రానిక్స్ లేదా దానికి సంబంధించిన సబ్జెక్టులలో కనీసం 60% మార్కులతో 3 సంవత్సరాల పూర్తి కాలపు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

జీతం: బేసిక్ పే నెలకు ₹23,910 + DA, HRA మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: 08 సెప్టెంబర్ 2026 (సాయంత్రం 6 గంటల వరకు).

BEML అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026

నాన్-ఎగ్జిక్యూటివ్ కేటగిరీ కింద భారీ స్థాయిలో అప్రెంటిస్ శిక్షణ ఖాళీలు కూడా భర్తీ అవుతున్నాయి.

మొత్తం ఖాళీలు: 1,346 పోస్టులు

పోస్టుల వివరాలు , స్టైపెండ్:

ITI / ట్రేడ్ అప్రెంటిస్: 952 పోస్టులు (స్టైపెండ్: ₹9,600 – ₹10,560)

డిప్లొమా అప్రెంటిస్: 125 పోస్టులు (స్టైపెండ్: ₹10,900)

గ్రాడ్యుయేట్ / డిగ్రీ అప్రెంటిస్: 269 పోస్టులు (స్టైపెండ్: ₹12,300)

వయోపరిమితి: 17 సంవత్సరాలు దాటి ఉండాలి.

ఎంపిక విధానం: మెరిట్ లిస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎలాంటి పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.

అప్లికేషన్ ఫీజు: ఉచితం (ఫీజు లేదు).

చివరి తేదీ: 08 సెప్టెంబర్ 2026.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement