Breaking News

మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్లో మొత్తం 667 ఖాళీల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.

మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్లో మొత్తం 667 ఖాళీల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ఫిబ్రవరి 21, 2026న విడుదలైంది.


Published on: 13 Mar 2026 17:38  IST

మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్లో మొత్తం 667 ఖాళీల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ఫిబ్రవరి 21, 2026న విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 16, 2026న ప్రారంభమై, ఏప్రిల్ 06, 2026 (రాత్రి 11:50 గంటలకు) ముగుస్తాయి.

ఖాళీల వివరాలు (మొత్తం 667):

మైనింగ్ సిర్దార్ (Mining Sirdar): 448 పోస్టులు

జూనియర్ ఓవర్మాన్ (Jr. Overman): 192 పోస్టులు

సర్వేయర్ (Surveyor): 24 పోస్టులు

ట్రాన్స్‌లేటర్ (Translator): 01 పోస్టు

టెక్నీషియన్ (Pathology): 02 పోస్టులు

అర్హతలు:

ఏప్రిల్ 06, 2026 నాటికి 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది). పోస్టును బట్టి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ మరియు అవసరమైన కాంపిటెన్సీ సర్టిఫికేట్లు ఉండాలి.కేవలం కంప్యూటర్ ఆధారిత పరీక్ష  ద్వారా మాత్రమే ఎంపిక జరుగుతుంది. ఇందులో ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. జనరల్, OBC మరియు EWS అభ్యర్థులకు ₹1,180 ఫీజు ఉంటుంది. SC/ST/PwBD/మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి