Breaking News

10, 12 తరగతి బోర్డు పరీక్షల్లో మార్పులు,, కేంద్రం గ్రీన్ సిగ్నల్?

విద్యా రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. బోర్డు పరీక్షల నిర్వహణ వ్యవస్థను మార్చాలనుకుంటుంది. విద్యార్థులకు మరింత అనుకూలంగా వాటిని తీర్చిదిద్దబోతోంది కేంద్ర ప్రభుత్వం. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి లేకుండా చేయడం మరింత మెరుగ్గా మార్కులను సాధించుకోవడంలో భాగంగా ఈ మార్పులకు తెర తీసింది కేంద్ర ప్రభుత్వం.


Published on: 20 Feb 2024 13:35  IST

ఇందులో భాగంగా 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులు ఇకపై ఒక సంవత్సరంలో రెండుసార్లు బోర్డు పరీక్షలను రాసే వెసలుబాటును కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  అంటే- ఒక విడత బోర్డు పరీక్షలను రాసిన విద్యార్థులకు అందులో ఆశించిన స్థాయిలో మార్కులు రాకపోతే  అవే పరీక్షలను మరోసారి రాసే అవకాశం ఈ కొత్త విధానంలో ఉంటుంది అని తెలిపింది.


తొలి విడత లేదా మలి విడతల్లో రాసిన పరీక్షల్లో ఎందులో ఎక్కువ మార్కులు వస్తే వాటిని అలాగే ఉంచుకుని తక్కువ మార్కులు వచ్చిన పరీక్షలను రద్దు చేసుకోవచ్చు అని తెలిపింది. రెండోసారి రాసిన పరీక్షలను సప్లిమెంటరీగా పరిగణించరు అని తెలిపింది. రెండు సార్లు పరీక్షలు రాసిన వారిని రెగ్యులర్ స్టూడెంట్‌గానే పరిగణిస్తారు అని  తెలిపారు . ఈ విధానం 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తుంది విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 
 

Follow us on , &

ఇవీ చదవండి